మెక్సికోలోనే అత్యంత హింసాత్మక రాష్ట్రం గయానాజువాటోలో తూపాకీ కాల్పుల మోత మోగింది. జరల్ డెల్ ప్రొగ్రెసో పట్ణణంలోని ఓ బార్లో దుండగుడు దారుణానికి తెగబడ్డాడు. బార్లో కనిపించిన వారందరిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో 11మంది మరణించారు. బార్లో డ్యాన్స్ చేసే నలుగురు మహిళలు కూడా వీరిలో ఉన్నారు.
సాయుధుడు ఏ ఉద్దేశంతో దాడికి పాల్పడ్డాడనే విషయంపై అధికారులు ఇంకా అంచనాకు రాలేదు. ఈ కిరాతకం వెనుక డ్రగ్ ముఠా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
గయానాజువాటో రాష్ట్రం మెక్సికోలో హింసకు మారుపేరు. ఇక్కడ తరచూ హత్యలు, నేరాలు జరుగుతూనే ఉంటాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక ముఠా నాయకుడ్ని పోలీసులు ఇటీవలే నిర్భంధించారు. అయినా నేరాలు తగ్గడం లేదు. ఈ రాష్ట్రంలో జులైలో 403 హత్యలు జరగగా.. ఆగస్టులో 339కి తగ్గాయి.