ప్రతిష్టాత్మక 104వ పులిట్జర్ అవార్డులను కొలంబియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. పాత్రికేయ రంగంలో అత్యున్నత పురస్కారం ఈ పులిట్జర్. ఫొటోగ్రఫీ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ముగ్గురు భారతీయులను వరించింది. కశ్మీర్లో పరిస్థితులను చిత్రీకరించిన ఛన్ని ఆనంద్, ముఖ్తర్ ఖాన్, దార్ యాసిన్‌కు ఈ గౌరవం దక్కింది.
అవార్డు విజేతలు...
జర్నలిజం:-
- బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్- ద కొరియర్- జర్నల్
- ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్- బ్రెయిన్ ఎమ్. రోసెంతల్, న్యూయార్క్ టైమ్స్.
- ఎక్స్ప్లనేటరీ రిపోర్టింగ్- వాషింగ్టన్ పోస్ట్
- లోకల్ రిపోర్టింగ్- బాల్టీమూర్ సన్
- నేషనల్ రిపోర్టింగ్- టీ. క్రిస్టియన్ మిల్లర్, మేఘన్ రోస్, రాబర్ట్ ఫాటురెచి(ప్రోపబ్లికా)
- అంతర్జాతీయ రిపోర్టింగ్- న్యూయార్క్ టైమ్స్
ఫొటోగ్రఫీ:-
- బ్రేకింగ్ న్యూస్ ఫొటోగ్రఫీ- రాయిటర్స్
- ఫీచర్ ఫొటోగ్రఫీ- ఛన్ని ఆనంద్, ముఖ్తర్ ఖాన్, దార్ యాసిన్(అసోసియేటెడ్ ప్రెస్)
15 జర్నలిజం, 7 పుస్తకాలు, డ్రామా, మ్యూజిక్ విభాగాలకు సోమవారం ఈ అవార్డులను ప్రకటించింది కొలంబియా విశ్వవిద్యాలయం. విజేతలకు ధ్రువపత్రంతో పాటు 15,000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.
ఇదీ చూడండి:- దుబాయ్‌లో భారతీయుడికి రూ.20 కోట్ల లాటరీ