దక్షిణ అమెరికాలోని కొలంబియాకు చెందిన 104 ఏళ్ల కార్మెన్ హెర్నాండేజ్ అనే బామ్మ.. రెండోసారి కరోనాను జయించారు. ఆమె చికిత్స పొందిన తంజా విశ్వవిద్యాలయంలోని శాన్ రఫేల్ డీ ఆసుపత్రి వైద్యులు కార్మెన్కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. పాతికేళ్ల కిందట తాను ముక్కు కేన్సర్‌ను కూడా జయించినట్లు తెలిపారు కార్మెన్.
2020, జూన్‌లో కార్మెన్ మొదటిసారి కరోనా బారినపడ్డారు. అప్పుడు కార్మెన్.. ఓ నర్సింగ్ హోంలో చికిత్స పొందారు. 2021, మార్చిలో ఆమెకు రెండోసారి కరోనా సోకింది. కొలంబియాలో కరోనాతో పోరాడి విజయం సాధించిన వృద్ధుల్లో అధికమంది మహిళలే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. 100-101 ఏళ్ల మధ్యవారిలో 94 మంది వైరస్‌ను జయించారు.
ఇదీ చదవండి : వైకల్యం అడ్డొచ్చినా.. రంగుల ప్రపంచంలో రారాజు!