అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూ ఓర్లిన్స్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఓ పదేళ్ల బాలుడు చనిపోగా, మరో ఇద్దరు బాలలు తీవ్రంగా గాయపడ్డారు.
"సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తలకు తూటా తగిలి ఓ పదేళ్ల బాలుడు మరణించాడు. 16 ఏళ్ల అమ్మాయి మరో 13 ఏళ్ల అబ్బాయి తీవ్రంగా గాయపడ్డారు."
- షాన్ ఫెర్గూసన్, న్యూ ఓర్లిన్స్ పోలీస్ చీఫ్
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని న్యూ ఓర్లిన్స్ మేయర్ లా టోయా కాన్ట్రెల్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఆ విషయంలో రష్యా, చైనా కంటే అమెరికానే బెస్ట్: ట్రంప్