2018 సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల జారీలో క్షీణత నమోదైంది. 2017తో పోలిస్తే 10 శాతం తక్కువ మందికి అమెరికా అనుమతులిచ్చింది. అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే భారత ఐటీ నిపుణులకు ప్రధాన మార్గం హెచ్-1బీ వీసాలే.
2018 ఆర్థిక సంవత్సరంలో కొత్తవి, పునరుద్ధరణ దరఖాస్తులు కలిపి మొత్తం 3,35,000 మందికి హెచ్-1బీ అనుమతులిచ్చింది అమెరికా పౌర, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం. 2017లో 3,73,400 మందికి వీసాలను జారీ చేసినట్టు వార్షిక నివేదికలో పేర్కొంది. దాఖలైన దరఖాస్తులకు అనుమతుల పరంగా చూస్తే 2017లో 93 శాతం, 2018లో 85 శాతంగా నమోదైంది.
"హెచ్-1బీ కార్యక్రమాన్ని నియంత్రించేందుకు అమెరికా అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రస్తుత నివేదికలు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది."
-సారా పియర్స్, వలస విధాన సంస్థ విశ్లేకురాలు
హెచ్-1బీ వలస రహిత వీసా అందిస్తోంది అమెరికా. వివిధ రంగాల్లో నిపుణులను విదేశాల నుంచి రప్పించేందుకు అమెరికా సంస్థలు ఈ వీసాను ఉపయోగిస్తాయి. భారత ఐటీ నిపుణులు కూడా ఎక్కువగా ఇదే వీసాపై ఆధారపడతారు.
ఇదీ చూడండి: సినీ ఫక్కీలో మహిళా ముఠా వరుస చోరీలు