ETV Bharat / international

మెక్సికోలో కాల్పుల కలకలం- 10 మంది మృతి - మెక్సికో క్రైమ్ న్యూస్

మెక్సికోలో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు.

10 killed in shooting attack in Mexico's Jalisco state
మెక్సికో కాల్పుల ఘటనలో 10 మంది మృతి
author img

By

Published : Feb 28, 2021, 11:25 AM IST

మెక్సికోలోని జలిస్కో ప్రాంతంలో కొందరు దుండగులు తుపాకులతో రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. ఓ మహిళ, ఇద్దరు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

పది మంది పురుషుల మృత దేహాలు దాడి జరిగిన ప్రాంతంలోని ఓ నివాసం వద్ద లభ్యమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కారులో వచ్చిన కొందరు ఆగంతుకులు శనివారం ఈ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.

గతంలోనూ జలిస్కో ప్రాంతంలో ఈ విధంగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఫిబ్రవరి మొదట్లో... వడులహర ప్రాంతంలో మానవ శరీర భాగాలున్న 18 ప్లాస్టిక్​ బ్యాగ్​లు పోలీసులకు దొరికాయి. 2020లో మొత్తం 189 మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి.

ఇదీ చదవండి:కొవిడ్‌ నుంచి కాపాడే వారసత్వ ప్రొటీన్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.