పెరూలో అధ్యక్షునికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించాడు. అధ్యక్షుడు మ్యానువల్ మెరినో ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 25 ఏళ్ల యువకుడు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దీనిపై స్పందించిన అధ్యక్షుడు తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. చదువు పూర్తికాని యువకులు ఉద్యోగం కోసం ఇలా చేస్తున్నారని తెలిపారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మెరినోకు వ్యతిరేకంగా 5వేల మంది సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఇంతకు ముందున్న అధ్యక్షుడు విజర్కాని అక్రమంగా తొలిగించి అధికార పీఠం ఎక్కిన మెరినో.. కరోనా కట్టడి, సామాజిక భద్రత కల్పనలో విఫలం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.