ETV Bharat / international

అమెరికా​ నైట్​ క్లబ్​లో కాల్పుల కలకలం - US Sports club news

అమెరికాలోని ఓ నైట్​క్లబ్​లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు అధికారులు.

1 killed, 3 wounded in shooting at Mississippi sports bar
అమెరికన్​ క్లబ్​లో కాల్పుల కలకలం.. ఒకరు మృతిc
author img

By

Published : Jul 4, 2020, 8:36 PM IST

అమెరికా మిస్సిసిప్పీ రాజధానిలోని ఓ నైట్​ క్లబ్​లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

హిండ్స్​ కౌంటీలోని జాక్సన్​లో ఎం-బార్​ స్పోర్ట్స్​ గ్రిల్​ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 41ఏళ్ల కార్టెజ్​ షెల్బీ అనే వ్యక్తి అక్కడిక్కడే చనిపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ట్విట్టర్​లో అనుమానితుడి చిత్రం..

కాల్పులకు సంబంధించి అనుమానితుడి ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది అధికార కార్యాలయం. నిందితుడ్ని గుర్తించేందుకు సాయపడాలని ప్రజలను కోరింది. ఘటన అనంతరం నిందితుడు బార్​ నుంచి పారిపోయాడని, అతడు తమ కస్టడీలో లేడని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.