ETV Bharat / international

అమెరికా హోటల్​లో కాల్పుల కలకలం - అమెరికాలోని హోటల్​లో కాల్పులు-

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. షికాగోలోని ఓ హోటల్​లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరికొంత మంది గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు.

1 dead, several injured in hotel shooting in Chicago suburb
అమెరికాలోని హోటల్​లో కాల్పులు- ఒకరు మృతి
author img

By

Published : Feb 7, 2021, 4:08 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో బ్లూమింగ్​డేల్​ గ్రామంలోని ఇండియన్​ లేక్స్​ హోటల్​లో జరిగిన ఈ ఉదంతంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు వివరించారు.

స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి 2.35 గంటలకు ఈ ఘటన జరిగింది. తాము అక్కడికి చేరుకునే సమయానికి హోటల్ నుంచి ప్రజలు పరుగులు తీస్తూ కనిపించారని పోలీసులు వివరించారు.

ఎంతమందికి గాయాలయ్యాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదని బ్లూమింగ్​డేల్​ ప్రభుత్వ అధికారి ఫ్రాంక్ జియామ్​రేసే తెలిపారు.

ఇదీ చదవండి : చైనా బాధ్యత వహించాల్సిందే: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.