ETV Bharat / international

covid new variant: కరోనా కొత్త వేరియంట్​.. డెల్టా కంటే ప్రమాదకరమా?

దక్షిణాఫ్రికాలో కొవిడ్​ కొత్త వేరియంట్(Covid new variant)​ వెలుగు చూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ వణికిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అసలింతకీ కొత్త కొవిడ్​ వేరియంట్​లో అంతలా ఆందోళన చెందాల్సిన అంశం ఏంటి? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

covid new variant
కరోనా కొత్త వేరియంట్
author img

By

Published : Nov 26, 2021, 2:18 PM IST

Updated : Nov 26, 2021, 3:14 PM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కొత్తకొత్త వేరియంట్లు(corona variants) పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. భారత్​లో డెల్టా వేరియంట్ సృష్టించిన బీభత్సం ఎంతటిదో మనందరికీ తెలుసు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్​(South african variant).. భారత్​తో పాటు అన్ని దేశాలను కలవరపెడుతోంది. ఈ వేరియంట్​ కారణంగా మన దేశంలో థర్డ్​ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అసలేంటీ కొత్త వేరియంట్​? ఇది డెల్టా కంటే డేంజరా?

కొత్త వేరియంట్​ ఏంటి?

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్​ను బి.1.1.529గా(b.1.1.529 variant) శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు, హాంకాంగ్, బోత్స్​​వానాలో ఇప్పటివరకు 50 కొత్త వేరియంట్​ కేసులు నిర్ధరణ అయ్యాయి.

ఎందుకు అంత భయం?

బి.1.1.259 చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల(new coronavirus variant mutation) కలయిక అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది శరీర రోగ నిరోధక శక్తిని ఏమార్చి, విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఈ వేరియంట్​కు గనుక వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల లేదా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటే.. ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

దక్షిణాఫ్రికాలో ఎక్కడ బయటపడింది?

దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు దేశంలోని ఎనిమిది ఇతర ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్​ వ్యాప్తి చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో కొత్త కేసులు పెరిగాయా?

తమ దేశంలో కొత్తగా 2,465 కరోనా కేసులు నమోదయ్యాయని దక్షిణాఫ్రికా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇది క్రితం రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే రెట్టింపు కావడం గమనార్హం. అయితే.. ఈ కేసుల పెరుగుదలకు కారణం కొత్త వేరియంటే అని వారు మాత్రం చెప్పలేదు. కానీ, స్థానిక శాస్త్రవేత్తలు వైరస్ కేసుల పెరుగుదలకు కారణం కొత్త వేరియంటేనని అంటున్నారు. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో నమోదైన మొత్తం కేసుల్లో 90శాతం కేసులకు కారణం ఈ వేరియంటేనని శాస్త్రేవేత్తలు చెబుతున్నారు.

ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?

దక్షిణాఫ్రికాతో పాటు బోత్స్​​వానా, హాంకాంగ్​లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికా నుంచి ఓ వ్యక్తి తమ దేశంలోకి రావడం వల్లే హాంకాంగ్​లో ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు.

ఇతర వేరియంట్లకు, ఈ కొత్త వేరియంట్​కు తేడా ఏంటి?

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూసిన వేరియంట్ల కంటే బి.1.1.529 అత్యంత ప్రమాదకరమైనదని సీనియర్ శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్ స్పైక్ ప్రొటీన్​లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. ఇది డెల్టా వేరియంట్ కంటే రెట్టింపు ఉత్పరివర్తనాలు అని చెప్పారు.

2020 చివర్లో డెల్టా వేరియంట్​ను భారత్​లో గుర్తించారు. ఆ తర్వాత ఇది ఇతర దేశాలకు విస్తరించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో, మరణాలు విపరీతంగా పెరిగాయి. ఈ వేరియంట్​ వివిధ దేశాల్లో ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లుగా ఉత్పరివర్తనం చెందింది.

విదేశాలు ఏం చేస్తున్నాయి?

దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. వివిధ దేశాలు మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

బ్రిటన్ ఇప్పటికే దక్షిణాఫ్రికాను(South africa travel ban) 'రెడ్​ లిస్ట్'​లో ఉంచింది. ఆ దేశం నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. దక్షిణాఫ్రికాతోపాటు ఇతర ఆఫ్రికా దేశాల ప్రయాణాలపైనా బ్రిటన్ నిషేధం విధించింది. ఇదే తరహాలో ఇజ్రాయెల్​ కూడా దక్షిణాఫ్రికా ప్రయాణాలపై నిషేధం విధించింది. ఈ కొత్త వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో ఐరోపా సమాఖ్య, జర్మనీ కూడా దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాలని యోచిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చే పర్యటకులపై నిషేధం విధిస్తున్నట్లు ఇటలీ, సింగపూర్ ప్రకటించాయి.

భారత్​లో ఈ కేసులు ఉన్నాయా?

ఇప్పటివరకు భారత్​లో బి.1.1.529 కేసులు(covid new variant india) వెలుగు చూడలేదని కేంద్రం శుక్రవారం తెలిపింది. ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది.

నెక్స్ట్​ ఏంటి?

వివిధ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పర్యవేక్షిస్తోంది. వైరస్ వ్యాప్తి తీరుతెన్నుల గురించి చర్చేందుకు ఓ ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేసింది. ఇందులో ఈ వేరియంట్​ను 'ఆందోళనకర రకం'గా పరిగణించే అంశాన్ని పరిశీలించనున్నారు.

ఇదీ చూడండి: Covid new variant: 'కరోనా కొత్త వేరియంట్​తో జాగ్రత్త'

ఇదీ చూడండి: అక్కడ 11% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్​ఓ

Last Updated : Nov 26, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.