వెనెజువెలాలో ప్రభుత్వ వ్యతిరేకులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షనేత 'జాన్ గుయాడో', ప్రధాన ఉద్యమకారుడు 'లిపోల్డో లోపెజ్'లు మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వందలాది మంది ఈ నిరసనల్లో పాల్గొని మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మొత్తం 68 మందికి గాయాలయ్యాయి.
భద్రతా సిబ్బంది వాహనాలను తగలబెడుతూ... పోలీసులపై రాళ్లు విసురుతూ నిరసనకారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నిరసనకారులపై రబ్బరు బుల్లెట్లతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు.