ETV Bharat / international

టీకాల సామర్థ్యంపై డబ్య్లూహెచ్​ఓ అనుమానం! - వ్యాక్సిన్​ సమర్థత

కొవిడ్​ టీకాల పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సందేహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన టీకాలు వైరస్​పై సరిగా పని చేస్తున్నాయా ? లేదా ? అని ప్రశ్నించింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగు చూసిన కొత్త రకంపై ప్రస్తుతం ఉన్న టీకాల ప్రభావం తక్కువే అని స్పష్టం చేసింది.

The Latest: WHO head raises questions about vaccines
టీకా పనితనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశ్న!
author img

By

Published : Feb 9, 2021, 8:59 AM IST

కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన టీకాల పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సందేహం వ్యక్తం చేసింది. టీకాలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? అనే ప్రశ్నలు లేవనెత్తింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగు చూసిన వైరస్​పై టీకాలు కొంత మేరకు తక్కువ ప్రభావం చూపవచ్చని తెలిపింది. దక్షిణాఫ్రికాలో ఆస్ట్రాజెనెకా వినియోగాన్ని నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జరనల్​ టెడ్రోస్​ అథనోమ్ స్పందించారు. 'ప్రజారోగ్యానికి సంబంధించి.. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు సంస్థ సాయపడుతుంది' హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వైరస్​ శాంపిల్​ చాలా చిన్న పరిమాణంలో ఉందన్నారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆలస్యం చేయకూడదని తెలిపారు. టీకా తయారీదారులు మరిన్ని వ్యాక్సిన్​లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దక్షిణాఫ్రికాలో ఆస్ట్రాజెనెకా టీకా నిలిపివేత

భారత్​లోని సీరం సంస్థ ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనెకా టీకాల పంపిణీని దక్షిణాఫ్రికా నిలిపివేసింది. వ్యాక్సిన్​ సమర్థతపై ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి జ్వేలీ మెకాంజ్​ తెలిపారు. సీరం సంస్థ నుంచి 10 లక్షల డోసుల టీకాలు ఈ నెల 1న దక్షిణాఫ్రికాకు చేరాయి. వీటిని మూడు విడతల్లో ప్రజలకు వేయాలని అక్కడి ప్రభుత్వం తొలుత భావించింది. ఇందులో మొదటి విడత కార్యక్రమం వచ్చే వారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆస్ట్రాజెనెకా టీకాపై దక్షిణాఫ్రికా సహా పలువురు వ్యాక్సిన్ నిపుణులు సందేహాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగుచూసిన 'బి.1.351' అనే కొత్త రకం కరోనా వైరస్​ను ఎదుర్కోవడంలో ఆస్ట్రాజెనెకా టీకా సామర్థ్యం అంతంతమాత్రమేనని ఈ అధ్యయనాలు చెబుతున్నట్లు వివరించారు.

స్వయంగా ఆస్ట్రాజెనెకా కూడా దీన్ని ధ్రువీకరించడాన్ని వారు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రారంభించ తలపెట్టిన టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు జ్వెలీ చెప్పారు. తదుపరి కార్యాచరణపై శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆస్ట్రాజెనెకా, జాన్సన్​ అండ్​ జాన్సన్​, ఫైజర్​ టీకాలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చే నెలలో అందుబాటులోకి వస్తాయన్నారు. ​'బి.1.351' వైరస్​కు సంబంధించిన స్వల్ప, ఒక మోస్తరు రూపాలపై ఆస్ట్రాజెనెకా టీకా సమర్థత తక్కువగా ఉందని ఆక్స్​ఫర్డ్​/ఆస్ట్రాజెనెకా ప్రయోగాల ముఖ్య పరిశీలకుడు ప్రొఫెసర్​ షాబిర్​ మాధి పేర్కొన్నారు. అయినా ఈ టీకాను ప్రజలకు వేయడమే మేలని చెప్పారు. మరోవైపు దక్షిణాఫ్రికాకు అందిన పది లక్షల డోసులకు ఏప్రిల్​తో కాలం చెల్లుతుంది. ఈ సమస్యపై సీరం సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు ఆరోగ్య మంత్రి డైరెక్టర్​ జనరల్​ అంబన్​ పిళ్లై చెప్పారు.

ఇదీ చూడండి: మరో వ్యాక్సిన్​కు చైనా ప్రభుత్వం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.