ETV Bharat / international

Suicide Bomb Blast: కాంగోలో ఆత్మాహుతి దాడి- ఆరుగురు మృతి - బ్రిజెల్​లో కాల్పులు

Suicide Bomb Blast: క్రిస్మస్​ వేడుకలు నిర్వహిస్తుండగా కాంగోలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఘటనలో.. బ్రెజిల్​లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

suicide bomber
ఆత్మాహుతి దాడి
author img

By

Published : Dec 26, 2021, 5:25 AM IST

Suicide Bomb Blast: సెంట్రల్​ ఆఫ్రికా కాంగోలో క్రిస్మస్​ వేడుకల్లో భాగంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కివు ప్రాంతం, బెనీ సిటీలోని ఓ బార్​లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు బాంబు పేలినట్లు ఓ అధికారి వెల్లడించారు. అనంతరం కాల్పులు కూడా జరిగినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకుని భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో దాదాపు 13 మందికి తీవ్రంగా గాయాలైయ్యాయి. దాడి ఎవరు జరిపారన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో బెనీ సిటీలో పలుమార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయి.

Gunfire in Northeast Brazil:

బ్రెజిల్​లో కాల్పులు..

బ్రెజిల్​లోని ఫోర్టాలెజాలో క్రిస్మస్​ వేడుకలు జరుపుకుంటుండగా పౌరులపై కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

కాల్పులకు పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇదీ చదవండి:

ట్రక్కు, బస్సు ఢీ- 10 మంది దుర్మరణం

మయన్మార్​లో మారణహోమం- 30మందిని చంపి కార్లలో దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.