ETV Bharat / international

చర్చిలోకి ముసుగు దొంగలు.. తొక్కిసలాటలో 29 మంది మృతి - Stampede in west africa

Stampede at Liberia: చర్చిలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారు. ఈ విషాద ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని లిబేరియాలో జరిగింది. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Stampede at religious ceremony in Liberia kills 29 people
చర్చిలోకి ముసుగు దొంగలు.. తొక్కిసలాటలో 29 మంది మృతి
author img

By

Published : Jan 20, 2022, 11:17 PM IST

Updated : Jan 21, 2022, 5:50 AM IST

Stampede at Liberia: పశ్చిమ ఆఫ్రికాలోని లిబేరియా దేశంలో విషాదం జరిగింది. మోనరోవియా నగరంలోని ఓ చర్చి​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 29 మంది మృతిచెందారు. మరణించినవారిలో 11 మంది చిన్నారులు, ఓ గర్భిణీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ముసుగు దొంగల రాకతో..

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా.. కొంతమంది ముసుగు దొంగలు కత్తులతో చర్చిలోకి ప్రవేశించారు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు.

మృతదేహాలను మార్చురీకి తరలించామన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: పాక్​లో పేలుడు.. భారతీయ వస్తువులు అమ్మే మార్కెట్​ లక్ష్యంగా...

Last Updated : Jan 21, 2022, 5:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.