ETV Bharat / international

జులు జాతి రాజు గుడ్​విల్ జ్వెలిథిని ఇకలేరు - క్వాజులు - నటల్ ప్రావిన్స్

దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నటల్ ప్రావిన్స్​ రాజు గుడ్​విల్ జ్వెలిథిని శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఏ రాజకీయ పదవి చేపట్టకపోయినా 1.2 కోట్ల జులు ప్రజలపై జ్వెలిథిని గణనీయ ప్రభావం చూపారు. జ్వెనిథిని మృతి పట్ల దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సంతాపం తెలిపారు.

jewelithini
జులు జాతి రాజు గుడివిల్ జ్వెలిథిని ఇకలేరు
author img

By

Published : Mar 13, 2021, 5:59 AM IST

Updated : Mar 13, 2021, 6:59 AM IST

దక్షిణాఫ్రికాలోని అత్యంత ప్రభావవంతమైన జాతి నాయకుడు, ప్రవాస భారతీయ సమాజంతో సత్సబంధాలను కాంక్షించిన కింగ్ గుడ్​విల్ జ్వెలిథిని (72) ఇక లేరు. మధుమేహ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. జులు జాతి నాయకత్వ పరంపరలో ఎనిమిదో నేతగా వారసత్వాన్ని అందుకున్న జ్వెలిథిని, 50 ఏళ్ల పాటు ఆ హోదాలో కొనసాగారు. ఏ రాజకీయ పదవి చేపట్టకపోయినా 1.2 కోట్లకు పైగా ఉన్న జులు ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపారు. తన జాతి ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి. తన పాలనలోని క్వాజులు-నటల్ ప్రావిన్సులో భూమిని పునఃపంపిణీ చేయడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చే యత్నాలు చేసినప్పుడు జ్వెలిథిని తప్పుపట్టారు. ఆ విధానం అమలు చేస్తే జులు రాజ్యానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. దీన్ని జ్వెలిథిని గట్టిగా వ్యతిరేకించారు.

హెచ్ఐవీపై, ఇటీవల కరోనాపైనా పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జ్వెలిథిని మరణంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొస సంతాపం వ్యక్తం చేశారు. క్వాజులు-నటల్ ప్రావిన్సు ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేయడం ద్వారా జ్వెలిథిని దేశ పురోగతికి పాటుపడ్డారంటూ ఈ సందర్భంగా రమఫొస గుర్తు చేసుకున్నారు.

భారతీయులు అంటే అభిమానం

దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులపై జ్వెలిథిని ప్రత్యేక అభిమానం చూపేవారు. క్వాజులు-నటల్ ప్రావిన్సులో స్థిరపడిన భారతీయ కుటుంబాలు, అక్కడి స్థానిక ప్రజల మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి జ్వెలిథిని ప్రత్యేక శ్రద్ధ చూపారు. భారతీయ మూలాలున్న పలువురిని తన సలహాదారులుగా నియమించుకున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వర్ రాంలచ్మన్ ఉన్నారు.

ఇదీ చదవండి : 30 మంది విద్యార్థులను అపహరించిన ఉగ్రవాదులు

Last Updated : Mar 13, 2021, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.