ETV Bharat / international

సీరం టీకా సరఫరాకు దక్షిణాఫ్రికా అనుమతి

author img

By

Published : Jan 24, 2021, 5:10 AM IST

భారత్​లో తయారైన కొవిషీల్డ్​ టీకా సరఫరా కోసం సీరం ఇన్​స్టిట్యూట్​కు దక్షిణాఫ్రికా అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్య శాఖ మంత్రి వెల్లడించారు.

South Africa's regulatory body approves Serum Institute of India's COVID-19 vaccine
భారత్​ టీకాకు ఆమోదం తెలిపిన మరో దేశం

కొవిషీల్డ్‌ టీకా సరఫరా చేసేందుకు సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు దక్షిణాఫ్రికా అనుమతులు ఇచ్చింది. టీకాను తమ దేశంలో పంపిణీ చేసేందుకు దక్షిణాఫ్రికా నియంత్రణ సంస్థ అనుమతించినట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రి జ్వేలి ఎమ్​ఖైజ్​ వెల్లడించారు. భారత్​ నుంచి టీకా డోసులు వచ్చాక.. వాక్సిన్​ పంపిణీపై ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపారు.

15 లక్షల డోసులు సరఫరాకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. సీరం సంస్థకు స్థానికంగా అనుమతులు లభించలేదన్న వార్తల నేపథ్యంలో తాజా ప్రకటన చేశారు మంత్రి జ్వేలి. ఫిబ్రవరి నాటికి 5 లక్షల టీకాలు దక్షిణాఫ్రికాకు చేరుకుంటాయని వివరించారు.

ఇదీ చూడండి: టీకా సమర్థతపై చర్చకు సై: అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.