ETV Bharat / international

భారత సంతతి ప్రజలే లక్ష్యంగా దాడులు! - దక్షిణాఫ్రికా న్యూస్ టుడే

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అల్లర్లలో భారత సంతతి ప్రజలే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఇళ్లు, వ్యాపార సంస్థలను దోచుకోవటం సహా తమపై దాడులకు పాల్పడుతున్నారని భారత సంతతి ప్రజలు ఆరోపిస్తున్నారు. అల్లరి మూకలను అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ వారితోపాటు ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు సాయుధులుగా మారుతున్నారు.

south africa, indian community
దక్షిణాఫ్రికా, ఇండియన్ కమ్యూనిటీ
author img

By

Published : Jul 17, 2021, 5:56 PM IST

మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా అరెస్టుకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాలో మొదలైన అల్లర్లలో ఇప్పటివరకు 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారే ఉన్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అల్లరి మూకల బారినుంచి తమ ఆస్తులను కాపాడుకునేందుకు భారత సంతతి ప్రజలు ఆయుధాలు కొనుగోలుచేసి రక్షణ పొందుతున్నారు. వ్యాపార రంగంతోపాటు ఇతర రంగాల్లో భారతీయులు రాణించడాన్ని జీర్ణించుకోలేని స్థానికులు అల్లర్లను అదునుగా మలచుకొని తమపై దాడులకు తెగబడుతున్నట్లు భారత సంతతి ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని వారు బెదిరిస్తున్నట్లు వాపోతున్నారు. అల్లరి మూకలను అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడమే కాకుండా భారత సంతతి ప్రజలపై దాడులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేజడ్‌ఎన్‌ ప్రావిన్స్‌లోని ప్రతి ఇద్దరు భారత సంతతివారిలో ఒకరు అల్లర్ల బాధితులుగా మారారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది.

భారత సంతతి వారిపైనే..

ఒక్క డర్బాన్‌లోనే మొత్తం 50 వేల వ్యాపార సంస్థలపై అల్లరి మూకలు దాడిచేశాయి. అందులో ఎక్కువగా భారత సంతతికి చెందినవారివే ఉన్నాయి. ఈ అల్లర్లలో రూ.8 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అక్కడి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలిపింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో 117 మంది మరణించగా అందులో ఎక్కువ మంది భారత సంతతి వారే ఉన్నట్లు తెలిపింది. జోహన్నెస్‌బర్గ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ.. డర్బాన్‌ ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. అల్లరి మూకలు వస్తే తుపాకులతో కాల్చి చంపుతామని భారత సంతతికి చెందిన వ్యాపారి ఒకరు హెచ్చరించారు. తమ ఇళ్లను, దుకాణాలను దోచుకోవడంతోపాటు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

భారత సంతతి ప్రజలు ముఖ్యంగా గుప్తా సోదరులపై దాడిచేయాలని ట్విటర్‌ వేదికగా దక్షిణాఫ్రికాలోని స్థానికులు పిలుపునివ్వడం అక్కడి భయంకర పరిస్థితులకు అద్దంపడుతోంది. ఈనేపథ్యంలోనే అల్లరి మూకల బారినుంచి తమ నివాసాలు, ఆస్తులు, వ్యాపార సంస్థలను కాపాడుకునేందుకు భారత సంతతి ప్రజలు సాయుధులుగా మారారు. తమ కాలనీల్లో నిఘా పెంచడంతోపాటు రాత్రిపూట ఆయుధాలు, వాకీటాకీలతో గస్తీ నిర్వహిస్తున్నారు. తమపై దాడుల నివారణకు దక్షిణాఫ్రికా గట్టి చర్యలు తీసుకునేలా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.