సోమాలియాలో ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యమయ్యాయి. రాజధాని మొగదిషులో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి తామే బాధ్యులమని అల్-షబాబ్ ప్రకటించింది. ఉగ్రవాదులు ఈ దాడికి మోటారు సైకిల్‌ను ఉపయోగించారని టర్కీ సైన్యం తెలిపింది. మృతుల్లో ముగ్గురు టర్కీ పౌరులు కూడా ఉన్నారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫరెత్తిన్ కోకా ట్వీట్ చేశారు.
ఈ మధ్యకాలంలో టర్కీ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దళాలు రెచ్చిపోతున్నాయి. ప్రస్తుత దాడి టర్కీ సైనిక స్థావరానికి 15కిలోమీటర్ల దూరంలో జరగడం గమనార్హం. ఈ దాడులను టర్కీ విదేశాంగ శాఖ ఖండించింది. తమ పౌరులపై జరిగే దాడులను సహించబోమని హెచ్చరించింది.
సోమాలియా సైన్యానికి మద్దతుగా నిలుస్తూ.. విద్య, వైద్య రంగాల్లో టర్కీ పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.
ఇదీ చదవండి: తాలిబన్ల దాడిలో ఆరుగురు పోలీసులు మృతి