ETV Bharat / international

ముక్కుకు బదులు కళ్లకు మాస్క్- దేశాధ్యక్షుడిపై జనం సెటైర్ - president struggles to put on face mask

మే1 నుంచి దక్షిణాఫ్రికాలో స్వల్పంగా లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలంతా మాస్కులు ధరించాలని సూచించారు. వాటిని ఎలా ఉపయోగించాలో చూపించే క్రమంలో సిరిల్​ చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

SAfrica president struggles to put on face mask
మాస్కు ధరించేందుకు ఆ దేశ ఆధ్యక్షుడు పడిన కష్టం చూశారా?
author img

By

Published : Apr 25, 2020, 4:22 PM IST

Updated : Apr 25, 2020, 10:24 PM IST

సిరిల్​ రామఫోసా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు సూచనలిస్తూ.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా మాస్కు ఎలా ధరించాలో చూపించే ప్రయత్నంలో చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.

ఏం జరిగిందంటే..

ప్రపంచ దేశాలతో పాటు దక్షిణాఫ్రికానూ కరోనా చుట్టుముట్టింది. దేశంలో వైరస్​ బాధితులకు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను శుక్రవారం పర్యవేక్షించారు సిరిల్. మే 1 నుంచి దేశంలో స్వల్పంగా లాక్​డౌన్​ ఆంక్షలు సడలించనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ క్రమంలోనే వాటిని ఎలా ఉపయోగించాలో చూపించే ప్రయత్నంలో చాలా ఇబ్బంది పడ్డారు సిరిల్​. అంతే దక్షిణాఫ్రికా ప్రజలు ఈ వీడియోపై సరదా కామెంట్లు చేస్తున్నారు.

అయితే 'మాస్కులను ఎలా ధరించాలో ప్రజలకు నేర్పించేందుకు తాను ఓ టీవీ ఛానెల్​ను ప్రారంభించబోతున్నట్లు' సిరిల్​ చమత్కరించారు.

శుక్రవారం నాటికి దక్షిణాఫ్రికాలో 4,220 కేసులు నమోదు కాగా.. 79మంది వైరస్​కు బలయ్యారు.

Last Updated : Apr 25, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.