రిచర్డ్ ట్యురెరె.. ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. ఆ బాలుడి ప్రతిభకు సలాం కొడతారు. అతడి ఆలోచన.. గొప్ప ఆవిష్కరణకు బీజం వేసింది. అదే ఇప్పుడు అతడ్ని ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టింది. కెన్యా ప్రజలకు అతడంటే గౌరవం పెరిగింది.
కెన్యాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. ఇది సింహాలు, పులులు, హైనా వంటి క్రూరమృగాలు సహా ఏనుగులు, రైనో వంటి జంతువులకు నిలయం. ఇదే అక్కడి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. దేశంలో ఎక్కువమందికి జీవనాధారం పశువుల పెంపకం. కానీ.. ఈ క్రూరమృగాలు, ముఖ్యంగా సింహాల వేటతో వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. కెన్యా నైరోబి నేషనల్ పార్క్ సమీపంలో ఉండే రిచర్డ్ కుటుంబానికీ ఈ కష్టాలు తప్పలేదు. వారికి ఉన్న ఒక్కగానొక్క ఎద్దును కూడా ఓ రోజు సింహం చంపేసింది.
ఆవుల షెడ్డుల్లో రాత్రి పూట కాపలా కాస్తుండే రిచర్డ్‌కు.. అప్పటినుంచే సింహాలంటే అసహ్యం వేసింది. వాటిని సమీపంలోని పశువుల శాలలో అడుగుపెట్టకుండా చూడాలని కంకణం కట్టుకున్నాడు.
మొదట మంటకు (నిప్పు) సింహాలు భయపడతాయని భావించి.. అలా చేసినా ఫలించలేదు.
రెండోది దిష్టిబొమ్మలు ఉపయోగించడం. అక్కడే నిలబడినట్లు నటిస్తే అవి పారిపోతాయని అనుకున్నాడు. కానీ.. సింహాలు తెలివైనవి కదా. అవి కదలట్లేదని తెలిసిపోయింది వాటికి. ఇది కూడా విఫలమే.
ఒక్క ఫ్లాష్‌తో..
ఇక ఓ రోజు మామూలుగా ఆవుల షెడ్డు పక్కన టార్చ్ పట్టుకొని తిరుగుతూ ఉండగా.. సింహాలు రాలేదు. అప్పుడు తట్టిందతనికి అసలైన వాస్తవం. అవి కదిలే టార్చ్‌కు (కాంతికి) భయపడుతున్నాయని గ్రహించి.. కొత్త ఆవిష్కరణ చేశాడు. వాళ్లమ్మ రేడియో తీసుకొని.. ప్రయోగాలు చేశాడు. ఎలక్ట్రానిక్స్‌పై అవగాహన పెంచుకున్నాడు. ఇక ఓ పాత కారు బ్యాటరీ, ఇండికేటర్ బాక్స్, ఓ స్విచ్, విరిగిపోయిన ఓ ఫ్లాష్ లైట్ తీసుకొని దానిని పశువుల షెడ్ ముందు అమర్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వామ్మో... ఇంత పెద్ద సాలెగూళ్లా?
బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాడు. అది ఇండికేటర్ బాక్స్‌కు పవర్‌ను సరఫరా చేస్తుంది. అప్పుడు లైట్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అక్కడ జరిగేది గమనించి.. సింహాలు భయపడి పారిపోయాయి. ఇదే అతడ్ని హీరో చేసింది. అప్పుడతనికి 11 సంవత్సరాలు.
''మీరు గమనిస్తే బల్బులు బయటివైపుకు ఉంటాయి. సింహాలు అక్కడి నుంచే కదా లోపలకు రావాల్సింది. నేను ఆవు షెడ్డు చుట్టూ తిరుగుతున్నానని ఆలోచిస్తూ, లైట్లు మెరుస్తూ సింహాలను మోసగించాయి. కానీ నేను ఇంట్లో మంచం మీద నిద్రపోతున్నాను.''
- రిచర్డ్ ట్యురెరె.
ఆ ఆలోచనతో.. చుట్టుపక్కల వాళ్లూ అలా తమకు ఏర్పాటు చేయాలని రిచర్డ్‌ను అడిగారు. అలా.. ఏడు ఇళ్లలోని పశువుల శాలల్లో వాటిని అమర్చాడు. అది మంచి ఫలితాన్నిచ్చింది. సింహాలు రావడం తగ్గింది. ఇది కెన్యా అంతటికీ తెలిసింది. అందరూ ఇదే విధానాన్ని అనుసరించారు. సింహాలే కాకుండా హైనా, చిరుతపులులు ఇతర క్రూరమృగాలు ఆ దరిదాపుల్లోకి రావడానికే భయపడేవి. ఇంకా.. ఏనుగుల నుంచి తమ పంట పొలాలను ఇది సాయపడింది.
ఈ ఆవిష్కరణతో.. రిచర్డ్‌కు కెన్యాలోని ప్రముఖ బ్రూక్హౌస్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కాలర్షిప్ లభిస్తోంది.
ఒకరోజు.. పశువులను మేపుతూ పైన విమానం ఎగురుతుండటాన్ని చూసి ఏదో ఓరోజు అక్కడ ఉంటానని తన నాన్నకు చెప్పాడట రిచర్డ్. ఈ ఆవిష్కరణతో ఇప్పుడు తొలిసారి విమానంలో వచ్చానని టెడ్ మీడియా కాన్ఫరెన్స్‌లో గుర్తుచేసుకున్నాడు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్, పైలట్ కావడమే తన ఆశయం అని చెప్పాడు.
ఇలా అతడి ఆలోచన కెన్యా అంతటికీ స్ఫూర్తిదాయకం. ఒక్క కెన్యానే కాదు.. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలనుకునే నవతరానికి అతడు ఆదర్శప్రాయం.
ఇదీ చూడండి: మొబైల్ ఫోన్లు కార్లకే పరిమితం- ఇది తెలుసా?