ETV Bharat / international

'ఆకలి కేకలతో నిమిషానికి 11మంది బలి'

author img

By

Published : Jul 9, 2021, 12:36 PM IST

ప్రపంచంలో ఆకలి చావులు తీవ్రమయ్యాయి. నిమిషానికి 11మంది ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆక్స్​ఫామ్​ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అటు ఆకలితో ప్రజలు మరణిస్తుంటే, ఇటు సైనిక కార్యకలాపాల కోసం ప్రపంచదేశాలు పెడుతున్న ఖర్చులు పెరిగిపోవడం ఆందోళనకరమని పేర్కొంది.

Oxfam food crisis
ఆకలి చావులు ఆక్స్​ఫామ్​

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలతో నిమిషానికి 11మంది మరణిస్తున్నారు. గతేడాదితో పోల్చితే కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న జనాభా ఆరింతలు పెరిగింది. పేదరికం నిర్మూలన కోసం కృషి చేస్తోన్న సంస్థ ఆక్స్​ఫామ్​ ఈ వివరాలను వెల్లడించింది.

ఆక్స్​ఫామ్​ విడుదల చేసిన 'ది హంగర్​ మల్టిప్లైస్​' నివేదిక ప్రకారం.. కరోనాతో నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో పోల్చితే..ఆకలి చావులే ఎక్కవ. 15.5కోట్లు మంది తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాదితో పోల్చితే ఇది 2కోట్లు ఎక్కువ. సైనిక సంఘర్షణల కారణంగా ఆయా దేశాల్లోని మూడింట రెండోంతుల మంది ఆకలి సమస్యలతో విలవిలలాడుతున్నారు.

కరోనా సంక్షోభం, పర్యావరణ మార్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు 40శాతం పెరిగాయి. ఇది దశాబ్ద కాలంలోనే అత్యధికం కావడం ఆందోళనకరం. ఫలితంగా లక్షలాది మంది ఆహార సంక్షోభంలోకి జారుకున్నారు.

"కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. పర్యావరణ సంక్షోభం తీవ్రమవుతోంది. వీటన్నిటికి తోడు, సైనిక సంఘర్షణల వల్ల 5.2లక్షలమంది ఆకలితో విలపిస్తున్నారు. కరోనాపై యుద్ధం చేయడం మానేసి, ఆయ దేశాలు ఒకదానిపై మరొకటి గొడవకు దిగాయి. ఆర్థికంగా కుదేలైన లక్షలాది మందిపై ఈ భారం పడింది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, ప్రజలు ఆకలితో విలపిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సైనిక కార్యకలాపాల కోసం కేటాయించే నిధులు 51 బిలియన్​డాలర్లు పెరగడం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులను నిలువరించేందుకు ఐరాస నిర్దేశించిన వ్యయం కన్నా ఇది దాదాపు ఆరు రెట్లు ఎక్కువ."

- ఆబ్బి మ్యాక్స్​మ్యాన్​, ఆక్స్​ఫామ్​ సీఈఓ.

అఫ్గానిస్థాన్​, ఇథియోపియా, దక్షిణ సుడాన్​, సిరియా, యెమెన్​ను అత్యంత దారుణమైన 'హంగర్​ హాట్​స్పాట్​'లుగా నివేదికలో పేర్కొంది ఆక్స్​ఫామ్​. ఇవన్నీ సైనిక సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలే!

ఆకలిని యుద్ధంలో ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని మ్యాక్స్​మ్యాన్​ ఆరోపించారు. బాంబుల కారణంగా పంట పొలాలు, మార్కెట్లు ధ్వంసమవుతుంటే ప్రజలకు ఆహారం అందదని పేర్కొన్నారు. సంఘర్షణలను వెంటనే ఆపి, ఆయా ప్రాంతాలకు సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది ఆక్స్​ఫామ్​.

ఇదీ చూడండి:- ఆకలి సంక్షోభం- 15.5కోట్ల మందిపై ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.