ETV Bharat / international

ఆఫ్రికాలో 9 దేశాలకు ఒమిక్రాన్​.. యూకే కొత్త నిబంధనలు.. - ఒమిక్రాన్ న్యూస్

Omicron news: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌.. ఆఫ్రికాలో తొమ్మిది దేశాలకు పాకింది. ​ దక్షిణాఫ్రికా నుంచి ఆయా దేశాలకు చేరుకున్నవారికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. అటు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు యూకే కొత్త నిబంధనలు విధించింది. 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్​ను తప్పనిసరి చేసింది.

Omicron virus news
ఆఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్
author img

By

Published : Dec 8, 2021, 3:52 AM IST

Updated : Dec 8, 2021, 6:36 AM IST

Omicron virus news: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్​.. ఆఫ్రికాలో తొమ్మిది దేశాలకు విస్తరించింది. అందులో బోట్సువానా, ఘనా, మోజాంబియా, నమీబియా, నైజీరియా, సెనెగల్​, ఉగాండ, జింబాబ్వేలు ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలో వేలసంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండగా.. ఉగాండలో మొదటిసారిగా ఏడుగురికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా నమోదైంది. నమీబియాలో 18 మంది ఒమిక్రాన్​ బారిన పడ్డారు. నైజీరియాలో తాజాగా మూడు కేసులు వెలుగుచూశాయి.

దక్షిణాఫ్రికా వ్యాపారానికి తీవ్ర దెబ్బ..

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటి నుంచి ఆ దేశంపై ప్రపంచదేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. విమాన రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆ దేశ వ్యాపారంపై తీవ్రమైన దెబ్బపడింది. కరోనా కారణంగా 2020లో దక్షిణాఫ్రికా పర్యటకం 70 శాతానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా పర్యటకానికి ప్రధాన ఆధారమైన బ్రిటన్ ప్రస్తుతం ఒమిక్రాన్ దృష్ట్యా ఆ దేశాన్ని రెడ్​ లిస్ట్​లో చేర్చింది.

యూకే కొత్త నిబంధనలు..

ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది బ్రిటన్​. తమ దేశంలోకి రావడానికి 48 గంటల ముందు కొవిడ్ నెగటివ్​ రిపోర్ట్​ను తప్పనిసరి చేసింది. రెడ్ లిస్ట్​ దేశాల నుంచి వచ్చేవారికి ప్రభుత్వ క్వారెంటైన్​లోనే ఉండేలా నిబంధనలు విధించింది.

Omicron community transmission:

ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది. ఇంగ్లాండ్​లోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 336 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 261 ఇంగ్లాండ్​లోనే బయటపడ్డాయని చెప్పారు. స్కాట్లాండ్​లో 71, వేల్స్​లో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించారు.

Omicron variant news:

కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారని బ్రిటన్ ప్రతినిధుల సభకు అందించిన నివేదికలో జావిద్ పేర్కొన్నారు. దీని ద్వారా సామాజిక వ్యాప్తి ఉందని స్పష్టమవుతోందని అన్నారు.

ఒమిక్రాన్​ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని జావిద్ స్పష్టం చేశారు. ఈ వేరియంట్ ప్రమాదకరమా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. టీకాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేదీ స్పష్టంగా తెలీదని చెప్పారు. శాస్త్రవేత్తలు దీనిపై నిర్ధరణకు వచ్చేంత వరకు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అన్నారు.

ఇదీ చదవండి: 'ఇంగ్లాండ్​లో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి'

Last Updated : Dec 8, 2021, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.