ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 15 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. దిప్ఫా పట్టణంలోని ఓ సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.
శరణార్థులకు ఆర్థికసాయం చేస్తుంటే..
నైజీరియా, చాద్ మధ్యనున్న ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మంది నైజీరియన్ శరణార్థులు, మరో లక్ష మంది వలసదారులు నివాసముంటున్నారు. సోమవారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన బోర్నో రాష్ట్ర గవర్నర్.. ఆహార పదార్థాలను, ఆర్థిక సాయాన్ని శరణార్థులకు అందించారు. వీటి కోసం వేలాదిమంది తరలిరాగా.. పంపిణీ చేసే కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
రేషన్ కోసం సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి శరణార్థులు రావడం, అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా: చైనాలో 1,860కి చేరిన మృతులు