మలావీలోని బ్లాంటైర్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. నీటి ప్రవాహానికి అందులో చిక్కుకొని 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. వరదల బీభత్సానికి దేశవ్యాప్తంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. ములాంజే జిల్లాలో వరద బాధితులకు శిబిరాలను ఏర్పాటు చేశారు. విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో బ్లాంటైర్ రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
మలావీ రక్షణ అధికారులు, పోలీసులు గల్లంతైన వారి కోసం విస్తృతంగా శోధిస్తున్నారు.
వర్షాలు వచ్చే వారంలోనూ కొనసాగుతాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.