ETV Bharat / international

మారిషస్​కు భారత్​ రూ.724 కోట్ల రుణసాయం

author img

By

Published : Feb 22, 2021, 8:54 PM IST

Updated : Feb 23, 2021, 11:40 AM IST

మారిషస్​ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్​ ఆ దేశ రక్షణ కొనుగోళ్లకు భారత్​ చేయూతనందిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు 100 మిలియన్ డాలర్ల(రూ.724 కోట్లు) భారీ రుణ సాయాన్ని ప్రకటించారు.

India offers USD 100 million line of credit to Mauritius to facilitate procurement of defence assets
మారిషస్​కు భారత్​ 7 వేలకోట్ల భారీ రుణసాయం

మారిషస్​ రక్షణ అవసరాలు తీర్చేందుకు భారత్​ ముందుకొచ్చింది. ద్వీప దేశానికి 100మిలియన్​ డాలర్లు(దాదాపు రూ.724 కోట్లు) రుణ సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు మారిషస్​ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్​ ఇరుదేశాల సంయుక్త సమావేశంలో వెల్లడించారు. సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)లో భాగంగా ఈ రుణాన్ని అందించనున్నట్లు జైశంకర్​ తెలిపారు.

హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక భాగస్వామిగా మారిషస్​ను భారత్​ భావిస్తోంది. ఆ దేశ ప్రధాని ప్రవింద్​ జగన్నాథ్​తో సమావేశమైన జైశంకర్​.. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. మారిషస్‌తో కుదిరిన సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు.

''ఇరు దేశాల మధ్య ఉన్నతంగా చర్చలు జరిగాయి. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. మారిషస్​లో భారత్ ఆధ్వర్యంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టుల అమలుపై చర్చించాం.''

-ఎస్​.జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

'సాగర్​'లో మారిషస్​ ప్రత్యేకం..

మారిషస్​ అవసరాలకు అనుగుణంగా భారత్ నుంచి రక్షణ పరికరాలు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించేలా దాదాపు 724 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి మంజూరుపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మారిషస్ భద్రత భారతదేశ భద్రత అని జైశంకర్​ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక కార్యక్రమం 'సాగర్'’(సెక్యూరిటీ అండ్​ గ్రోత్​ ఫర్​ ఆల్​ ఇన్​ ద రీజియన్​)లో మారిషస్​కు అధిక ప్రాధాన్యం ఉందన్నారు.

టీకాల అందజేత..

సీఈసీపీఏ ఒప్పందం ఖరారుపై నరేంద్ర మోదీ తరపున.. మారిషస్​ ప్రధాని జగన్నాథ్​కు శుభాకాంక్షలు తెలిపారు జైశంకర్​. మారిషస్​లో కరోనాపై పోరులో భాగంగా భారత్​లో తయారైన లక్ష కరోనా టీకాలను ఎస్​.జైశంకర్​ అందజేశారు.

ఇదీ చదవండి: బ్రిక్స్​ విషయంలో భారత్​కు చైనా మద్దతు!

Last Updated : Feb 23, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.