ఆఫ్రికా ఖండం పరిధిలోని ద్వీపదేశం కొమోరోస్.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 'ది ఆర్డర్ ఆఫ్ క్రెసెంట్' పురస్కారాన్ని వెంకయ్యకు అందించారు ఆ దేశ అధ్యక్షుడు అజాలీ అస్సౌమానీ. తనకు కొమోరోస్ పౌర పురస్కారం లభించడంపై ట్వీట్ చేశారు వెంకయ్య.
"కొమోరోస్ అత్యున్నత పౌర పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్'ను అధ్యక్షుడు అజాలి మస్సోమాని నాకు ప్రధానం చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను."
- వెంకయ్యనాయుుడు, భారత ఉపరాష్ట్రపతి ట్వీట్
కీలక ఒప్పందాలు
వెంకయ్యనాయుడు, అస్సౌమాని మధ్య విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, ఆరోగ్యం, సంస్కృతి సహా ఆరు అంశాలపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి.
తక్కువ వ్యవధి దౌత్య, అధికారిక పర్యటనలు జరిపే అధికారులకు వీసా నుంచి మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు.
సముద్రం సాక్షిగా భారత్, కొమోరోస్ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం ఇరుదేశాల భద్రతను మరింత పటిష్టం చేస్తుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
వెంకయ్యనాయుడు కొమోరోస్, సియోర్రా లియోన్ల్లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి.
వెంకయ్యనాయుడు అక్టోబర్ 10 నుంచి 14 వరకు కొమోరోస్, సియెర్రా లియోన్ దేశాల్లో పర్యటిస్తున్నారు.
ఇదీ చూడండి: తూరుపు తీరంలో కొత్త పొద్దు పొడుస్తుందా..?