దక్షిణాఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, మాలావి దేశాలు ఇదాయ్ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. విపత్తు వల్ల ఇప్పటి వరకు 500 మందికిపైగా ప్రజలు మరణించారు.
తుపాను ధాటికి జింబాబ్వేకు చెందిన 120కు పైగా మృతదేహాలు పక్కనే ఉన్న మెజాంబిక్కు కొట్టుకుపోయాయి. వారిని అక్కడి స్థానికులే ఖననం చేశారని జింబాబ్వే రక్షణ మంత్రి తెలిపారు.
ఇప్పటి వరకు ఇదాయ్ కారణంగా జింబాబ్వేలో 259 మంది, మొజాంబిక్‌లో 217 మంది, మాలావిలో కనీసం 56 మంది మరణించి ఉంటారని అధికారుల అంచనా.
సెంట్రల్ మొజాంబిక్‌లో వర్షం ధాటికి గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరదలు తగ్గినప్పటికీ చాలా ప్రాంతాలు బురదమయం అయ్యాయి.
తుపాను కారణంగా 4లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస ఫుడ్ ఎయిడ్ ఏజెన్సీ తెలిపింది.
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ తెలిపింది. గురువారం ఒక్క రోజే మొజాంబిక్‌లోని బెయిరా పట్టణంలో 910 మందిని బోట్లు, హెలికాఫ్టర్ల సహాయంతో రక్షించినట్లు తెలిపింది.