ETV Bharat / international

ఇంజెక్షన్​తో మహిళలకు హెచ్​ఐవీ నుంచి రక్షణ - HIV injection by africa scientists latest news

హెచ్​ఐవీ పరిశోధనలో ముందడుగు వేశారు ఆఫ్రికా శాస్త్రవేత్తలు. భర్త నుంచి హెచ్​ఐవీ వ్యాధి భార్యకు సోకకుండా కాబోటెగ్రావిర్ అనే ఇంజెక్షన్ సత్ఫలితాలను ఇస్తోందని కనుగొన్నారు. ఈ ఇంజెక్షన్​ను రెండు నెలలకోసారి ఇస్తే సరిపోతుందని వెల్లడించారు.

HIV injections latest news
ఇంజెక్షన్​తో మహిళలకు హెచ్​ఐవీ నుంచి రక్షణ
author img

By

Published : Nov 10, 2020, 6:48 AM IST

హెచ్​ఐవీ సోకిన భర్త నుంచి భార్యకు ఆ వ్యాధి సంక్రమించకుండా నిరోధించడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఒక ప్రయోగాత్మక ఇంజెక్షన్​ను రెండు నెలలకోసారి ఇస్తే.. మెరుగైన రక్షణ లభిస్తుందని తేల్చారు. ఆఫ్రికా వంటి దేశాల్లో ఎయిడ్స్​ నివారణకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ముందడుగు. ఈ ప్రయోగం ఆఫ్రికాలో జరిగింది. ఇందులో భాగంగా కాబోటెగ్రావిర్​ ఇంజెక్షన్​ను, ట్రువాడా మాత్రలను పరీక్షించారు.

హెచ్​ఐవీ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ రెండు ఔషధాలూ సమర్థంగానే పనిచేస్తున్నప్పటికీ కాబోటెగ్రావిర్​.. మాత్రల కన్నా 89 శాతం మేర మెరుగ్గా పనిచేస్తోందని తేల్చారు. ఈ మాత్రలను రోజూ తీసుకునే కన్నా రెండు నెలలకోసారి ఇంజెక్షన్​ పొందడం నయమని నిర్ధరించారు. కాబోటెగ్రావిర్​ను వీఐఐవీ హెల్త్​కేర్​ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ట్రువాడాను గిలీడ్​ సైన్సెస్​ సంస్థ తయారుచేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.