రెండు బస్సులు పరస్పరం ఢీకొన్న ఘటన ' ఘనా'లో జరిగింది. తూర్పు బోనో ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు. కింటాంపో- టెకీమాన్ రహదారి వద్ద జరిగిందీ ఘటన.
ప్రమాద సమయంలో రెండు బస్సుల్లోనూ ప్రయాణికులు ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.