సోమాలియాలో శనివారం ఏకకాలంలో జరిగిన రెండు బాంబు దాడుల్లో కనీసం 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో కనీసం 9మంది భద్రతా సిబ్బంది మృతిచెందారని అధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులు తామే చేశామని అల్ షబాబ్ ఉగ్రసంస్థ ప్రకటించింది.
బరిరే, అవధేగ్లేలో గ్రామాలలోని ఆర్మీ స్థావరాల్లో ఈ దాడులు జరిగాయి. అయితే దాడికి పాల్పడినవారికే అధిక నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో 60మంది, మరో స్థావరంలో 17 మంది షబాబ్ ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. కాగా 47 మంది సైనికులను బలిగొన్నట్లు షబాబ్ ప్రకటించింది.
మరో ఘటనలో రాజధాని మొగదిషులోని ఓ టీ కొట్టు వద్ద ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. సోమాలియాలో రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని అల్‌ఖైదా ఈ దాడులకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: అమెరికాలో కాల్పులు- ముగ్గురు మృతి