ETV Bharat / international

ఇథియోపియా ఎన్నికల్లో అబీ అహ్మద్ ఘన విజయం

ఇథియోపియా ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు నిర్వహించిన 436 స్థానాల్లో ప్రాస్పెరిటీ పార్టీ 410 సీట్లు సొంతం చేసుకోవడం గమనార్హం.

ethiopia, abhiy
ఇథియోపియా ప్రధాని, అబి అహ్మద్
author img

By

Published : Jul 11, 2021, 5:40 AM IST

ఇథియోపియాలో జరిగిన ఎన్నికల్లో అధికార ప్రాస్పెరిటీ పార్టీ సత్తా చాటింది. గతనెల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజేతగా నిలిచి.. రెండో సారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం దక్కించుకున్నారు ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్.

మొత్తంగా 436 సీట్లుకు గాను 410 సీట్లు ప్రాస్పెరిటీ పార్టీ సొంతం చేసుకున్నట్లు ఇథియోపియా జాతీయ ఎన్నికల బోర్డు శనివారం రాత్రి ప్రకటించింది. అయితే.. మరికొన్ని స్థానాల్లో పలు కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించలేదని స్పష్టంచేసింది. సెప్టెంబర్​ 6న మిగతా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుందని పేర్కొంది.

తీవ్ర నిరసనల మధ్య ఇథియోపియా మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసిన తర్వాత 2018లో తొలిసారిగా అబీ అధికారంలోకి వచ్చారు. తర్వాత అబీ కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. టిగ్రే ప్రాంతంలో జరిగిన సంఘర్షణల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశంలో అబీపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. రాజకీయ, మీడియా స్వేచ్ఛలపై తాను చేసిన వాగ్దానాలపై కూడా అబీ వెనక్కి తగ్గారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కొవిడ్​ కారణంగా రెండు సార్లు వాయిదా పడిన ఎన్నికలు.. జూన్​లో శాంతియుతంగా జరిగాయి. అయితే.. ఈ ఎన్నికలు బెదిరింపుల మధ్య జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ, దేశంలో తొలిసారిగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగాయని అబీ పేర్కొన్నారు. అమెరికా మాత్రం.. ఈ ఎన్నికలను పెద్ద పొరపాటుగా అభివర్ణించింది.

ఇదీ చదవండి:నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న ఇథియోపియా ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.