నైజీరియా రాజధాని లాగోస్‌లోని ఓ మూడొంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది. వంద మందికి పైగా చిన్నారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 37 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
నైజీరియాలో భవన నిర్మాణాలు నాసిరకంగా ఉంటాయని ఇప్పటికే పలువురు ఆరోపించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సైతం నైజీరియా అవస్థాపన సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:గ్యాస్ సిలిండరే పేలిందా?