ETV Bharat / international

నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్​ టుటు కన్నుమూత - దక్షిణాఫ్రికా న్యూస్​

Desmond tutu funeral: జాతి వివక్షపై పోరాడిన సామాజిక కార్యకర్త, నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్​ టుటు కన్నుమూసినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా ప్రకటించారు.

Desmond Tutu
డెస్మండ్​ టుటు
author img

By

Published : Dec 26, 2021, 1:44 PM IST

Updated : Dec 26, 2021, 2:55 PM IST

Desmond tutu funeral: జాతి సమానత్వం, ఎల్​జీబీటీల హక్కుల కోసం పోరాడిన కార్యకర్త, నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికాలోని కేప్​టౌన్​ మాజీ ఆంగ్లికన్​ ఆర్చ్​ బిషప్..​ డెస్మండ్​ టుటు​(90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా ఆదివారం ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు విముక్తి కల్పించిన మరో గొప్ప వ్యక్తిని కోల్పోయామన్నారు.

వర్ణ వివక్ష, నల్లజాతీయులపై క్రూరమైన అణచివేత పాలనపై అహింసామార్గంలో అవిశ్రాంత పోరాటం చేశారు డెస్మండ్​ టుటు. జోహన్నెస్​బర్గ్​లోని చర్చిలో తొలి నల్లజాతి బిషప్​గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేప్​టౌన్ ఆర్చ్​ బిషప్​గా సేవలందించారు. వర్ణ వివక్షపై దేశీయంగా, అంతర్జాతీయంగా తన ప్రసంగాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.

1997లో ప్రొస్టేట్​ క్యాన్సర్​ బారిన పడ్డారు టుటు. 2015 నుంచి పలుమార్లు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

భారత్​-దక్షిణాఫ్రికా క్రికెటర్ల నివాళి

డెస్మంట్​ టుటు గౌరవార్థం భారత్​-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్​ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ఆటగాళ్లు కొన్ని క్షణాల పాటు మౌనం పాటించారు. అలాగే దక్షిణాఫ్రికా క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్స్​ ధరించి మైదానంలోకి దిగారు.

మోదీ సంతాపం..

నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్​ టుటు మృతి పట్ల సంతాపం ప్రకటించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన మద్దతుదారులు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి వెలుగును చూపారని గుర్తు చేసుకున్నారు. మనుషుల మధ్య సమానత్వం, గౌరవం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్​ చేశారు.

  • Archbishop Emeritus Desmond Tutu was a guiding light for countless people globally. His emphasis on human dignity and equality will be forever remembered. I am deeply saddened by his demise, and extend my heartfelt condolences to all his admirers. May his soul rest in peace.

    — Narendra Modi (@narendramodi) December 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: అధ్యక్షుడిగా బైడెన్ తొలి క్రిస్మస్.. సైనికాధికారులకు వీడియో కాల్

Last Updated : Dec 26, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.