Burkina Faso Protests: పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ ఇంటికి సమీపంలో ఆదివారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. ఆ దేశ రాజధాని వాగడూగు సైనిక శిబిరాన్ని సైన్యం స్వాధీనం చేసుకుందనే ఊహాగానాల తర్వాత ఈ చర్య స్థానికంగా మరింత భయాన్ని పెంచింది. సైనిక తిరుగుబాటును సూచిస్తోంది.
Burkina Faso Unrest: గత కొన్ని వారాలుగా దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఇస్లామిక్ తిరుగుబాటు దళాల అణచివేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సైన్యం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో సైనిక బలగాల్లో తిరుగుగుబాటు చెలరేగి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. అలాంటిదేం లేదని ఖండించిన ప్రభుత్వం దేశాధ్యక్షుణ్ని ఎవరూ నిర్బంధించలేదని ప్రకటించింది. కాగా, ఇదే విషయమై అధ్యక్షుడు కాబోర్ రాజీనామా చేయాలంటూ వాగడూగులో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా?.. వెలుగులోకి ఆసక్తికర ఆధారం!