ETV Bharat / international

రెచ్చిపోయిన సాయుధులు- 100 మంది పౌరులు హతం - బుర్కినాఫాసో సాయుధుల దాడి

burkina-faso-100-civilians-die-in-gunmen-attack
రెచ్చిపోయిన సాయుధులు- 100 మంది పౌరులు హతం
author img

By

Published : Jun 5, 2021, 7:03 PM IST

Updated : Jun 5, 2021, 7:37 PM IST

18:56 June 05

రెచ్చిపోయిన సాయుధులు- 100 మంది పౌరులు హతం

ఆఫ్రికా దేశం బుర్కినాఫాసోలో సాయుధులు రెచ్చిపోయారు. ఓ గ్రామంపై విరుచుకుపడి వంద మందిని కిరాతకంగా హత్య చేశారు. యాఘా రాష్ట్రం సాహెల్ పట్టణంలోని సోల్హన్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.  

నైజర్ దేశ సరిహద్దులో ఉండే స్థానిక మార్కెట్​ను నేలమట్టం చేశారని అధికారులు చెప్పారు. పలు ఇళ్లను సైతం తగులబెట్టారని వెల్లడించారు. ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు రూక్ మార్క్ క్రిస్టియన్ కబోరే ఖండించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. ఈ ఘటన నేపథ్యంలో 72 గంటల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

ఇటీవల బుర్కినాఫాసోలో తీవ్రవాదుల దాడులు అధికమవుతున్నాయి. సాహెల్ నగరంలో ఐదు వేలకు పైగా ఫ్రెంచ్ బలగాలు ఉన్నప్పటికీ హింస పేట్రేగిపోతోంది. ఏప్రిల్ నెలలోని ఒక్క వారంలో 50 మందిని వీరు హతమార్చారు. ఇద్దరు స్పానిష్ జర్నలిస్టులు సహా ఓ ఐరిష్ వ్యక్తిని చంపేశారు. ఈ ఘటనల కారణంగా పది లక్షలకు పైగా పౌరులు తన స్వస్థలాలను విడిచి వెళ్లారు.  

ఇదీ చదవండి- Viral: ఆరేళ్లు శ్రమించి అండర్​గ్రౌండ్​లో ఇల్లు నిర్మాణం

Last Updated : Jun 5, 2021, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.