ETV Bharat / international

Nigeria News: నైజీరియాలో కాల్పులు.. 43 మంది మృతి - నైజీరియా కాల్పుల్లో 43 మంది మృతి

నైజీరియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో సుమారు 43మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సొకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్​లో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

gunmen attack
కాల్పులు
author img

By

Published : Oct 19, 2021, 8:46 AM IST

Updated : Oct 19, 2021, 9:32 AM IST

నైజీరియాలో (Nigeria News) జరిగిన కాల్పుల్లో సుమారు 43మంది చనిపోయారు. ఆ దేశానికి వాయువ్య భాగంలో ఉన్న సొకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్​లో ఆ ఘటన జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

తొలుత 30మంది చనిపోగా.. 20మందికి తీవ్రగాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు 200 మంది మార్కెట్​లోకి వచ్చి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పుకొచ్చారు. వీరంతా మోటార్​ సైకిల్​పై వచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 8న ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నైజీరియా (Nigeria News) సరిహద్దుల్లో ఉండే నైజర్​కు సమీపంలో ఉన్న ఓ గ్రామ మార్కెట్​లోకి చొరబడిన బందిపోట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు.

నైజీరియాలోని ఇలాంటి నేరాలు తరుచూ.. వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: బంగ్లాదేశ్​లో ఆగని అల్లర్లు.. 86 ఇళ్లు ధ్వంసం

Last Updated : Oct 19, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.