సోమాలియాకు చెందిన జిహాదీ తీవ్రవాదులు కెన్యాలో దాడికి పాల్పడ్డారు. లాము తీరంలోని అమెరికా, కెన్యా సంయుక్త సైనిక స్థావరంపై ముష్కరులు దాడికి పాల్పడినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. సింబా క్యాంప్ వద్ద తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు తెలిపారు. దాడిని దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.
దాడి చేసింది తామేనని అల్ షబాబ్ సంస్థ ప్రకటించింది. 'కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనిక స్థావరాన్ని విజయవంతంగా ధ్వంసం చేసి స్థావరంలోని ఓ భాగాన్ని అధీనంలోకి తీసుకున్నాం' అని ఓ ప్రకటనలో తెలిపింది. కెన్యా, అమెరికాకు చెందిన సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.
'అల్ఖుదూస్(జేరుసలేం)ను ఎప్పటికీ యూదులుగా మార్చలేరు' అన్న విధానానికి కట్టుబడి ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పేరుతో ఇదివరకే పలు దాడులకు పాల్పడింది అల్ షబాబ్.
ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల సిరియా యుద్ధంలో అంతులేని నరమేధం