గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని హఫీజ్పేట్ బీజేపీ అభ్యర్థి అనూష మహేష్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న ప్రజలే తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హఫీజ్పేట్ డివిజన్లోని పలు కాలనీల్లో అనూష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో ప్రజల నుంచి విశేష స్పందన రావటం చూస్తే తన గెలుపు ఖాయమనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి నిధులు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలే తెరాస పనితీరును ప్రశ్నిస్తున్నారు : అనూష యాదవ్ - telangana politics
తన ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని హఫీజ్ పేట్ డివిజన్ భాజపా అభ్యర్థి అనూష యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విసుగెత్తిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అందువల్ల తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.