హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఓటింగ్ ముగిసిన తరువాత బాణసంచా కాల్చారు. ఓటర్ల తీరు, తమ సర్వేలు చూస్తుంటే.. భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పీఠం తమకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికైనా తమదే విజయమన్నారు.
ఎంఐఎం, తెరాస కలిసి పలుచోట్ల రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా.. గెలుపు తమదేనని.. ఓటర్ల ఆశీస్సులు తమకే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?