జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల జోరుతోనే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఓటర్లు తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తామని... ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు.
ఎంఐఎం, తెరాస దాడి చేసినా పట్టించుకోని డీజీపీ, తెరాసను గెలిపించాలనుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు ఈ గెలుపును అంకితం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ విజయానికి సహకరించిన భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వీరోచిత పోరాటం చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గడీ నుంచి బయటకు రావాలన్నారు. తెరాస పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 55 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం