ETV Bharat / entertainment

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!! - కార్తీక దీపం మోనీత లవర్ ఎవరు

Bigg Boss 7 Telugu Contestant Shobha Shetty Lover : కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా "డాక్టర్‌ బాబు" వెంటపడ్డ శోభాశెట్టి.. నిజ జీవితంలో మాత్రం ప్రియుడిని తన వెంట తిప్పుకుంటోంది. అందరికీ తెలిసిన నటుడినే ప్రేమిస్తున్నప్పటికీ.. ఎక్కడా ఆ విషయాన్ని లీక్ కాకుండా దాచిపెట్టింది. కానీ, "దీపావళి బిగ్‌బాస్‌ ప్రోమో"లో శోభా లవర్‌ను హోస్ట్ నాగార్జున అందరికీ పరిచయం చేశారు..!

Shobha Shetty Lover
Shobha Shetty Lover
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 5:27 PM IST

Shobha Shetty Lover : కార్తీక దీపం సీరియల్‌లో విలన్​గా తెలుగు రాష్టాల టీవీ ప్రేక్షకుల్ని అలరించిన శోభా శెట్టి.. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ 7వ సీజన్​లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తన పర్సనల్ విషయాలను మాత్రం ఇన్నాళ్లూ ఎవరికీ షేర్ చేయలేదు శోభా. కానీ.. దీపావళి సందర్భంగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో.. శోభాశెట్టి లవర్‌ను స్టేజ్‌పై నిల్చోబెట్టారు నాగార్జున.

మొన్నటి వరకు శోభా శెట్టికి ప్రియుడు ఉన్నాడనే విషయం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ.. బిగ్‌బాస్‌ హౌస్​కి వచ్చిన తర్వాతే.. అప్పుడప్పుడూ తన లవర్ గురించి తేజతో చెప్తూ ఉంది. దీంతో.. ఆమెకు ప్రియుడు ఉన్నాడనే విషయం ఆడియన్స్‌కి తెలిసింది. అయితే.. ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ.. తన ప్రియుడి పేరు కూడా చెప్పలేదు. కానీ.. బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున డైరెక్ట్‌గా.. శోభా లవర్‌ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి నిల్చోబెట్టడంతో అందరికీ తెలిసిపోయింది. దీపావళి సందర్భంగా వచ్చిన బిగ్‌బాస్ ప్రోమోలో శోభా శెట్టి.. స్టేజ్ మీద తన లవర్‌ని చూసి అవాక్కయిపోయింది. ఇంతకీ అసలు శోభా ప్రేమికుడు ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో? తెలుసుకుందాం.

కార్తీక దీపం "డాక్టర్ బాబు" తమ్ముడే..
మహిళా ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్‌లో.. డాక్టర్ బాబు (నిరుపమ్) తమ్ముడిగా చేసిన.. ఆదిత్య (యశ్వంత్) అందరికీ గుర్తుండే ఉంటాడు. అతనే.. శోభా శెట్టి బాయ్‌ ఫ్రెండ్‌. కార్తీక దీపం సీరియల్‌లో.. డాక్టర్ బాబు వెనకాలే చివరి వరకు మోనిత తిరిగింది. కానీ.. రియల్ లైఫ్‌లో అదే డాక్టర్ బాబు తమ్ముడిని తన చుట్టూ తిప్పుకుంటోంది. కార్తీక దీపం సీరియల్‌ పూర్తైన తర్వాత కూడా.. యశ్వంత్‌తో శోభా శెట్టి ఫ్రెండ్​​ షిప్‌ కొనసాగించింది. ఆ తరువాత వీరి స్నేహం ప్రేమగా మారిందని టాక్. కానీ.. ఈ విషయాన్ని ఎప్పుడూ ఎక్కడా మోనిత పంచుకోలేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నట్లుగానే నటించారు.

యశ్వంత్‌
యశ్వంత్

సినిమా కూడా..
వీరిద్దరూ కలిసి కార్తీక దీపం సీరియల్ తరవాత ఒక సినిమా కూడా చేశారు. "బుజ్జి బంగారం" అనే ఈ సినిమాలో ఇద్దరూ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది ఓ రొమాంటిక్ కథా చిత్రం. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుందని, జంట కూడా బాగుంటుందని, పెళ్లి చేసుకుంటే సూపర్‌ జోడి అవుతుందని ఆడియన్స్ ఫీలయ్యారు. అనుకున్నట్టుగానే.. వీరిద్దరూ ప్రేమికులనే విషయం ఇప్పుడు బయటపడిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శోభా శెట్టి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత.. యశ్వంత్ సోషల్ మీడియాలో ఆమె కోసం వీడియోలు పోస్ట్ చేశాడు. శోభాకి ఓట్ చేసి గెలిపించండి అని ప్రేక్షకులను కోరాడు కూడా.

అయితే.. బిగ్‌బాస్‌ హౌస్‌లో శోభా.. తేజతో చాలా చనువుగా ఉండేది. దీంతో.. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్‌ నడిపించాలని.. బిగ్‌బాస్ గట్టిగానే ట్రై చేశాడు. ఈ సందర్భంలోనే ఒకసారి తన లవర్ ఏమనుకుంటాడో అని శోభా ఏడ్చింది. ఏది ఏమైనా.. మొత్తానికి నాగార్జున దీపావళి వేళ శోభాకి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Big boss Bhagvant Kesari : బిగ్ బాస్​లో 'భగవంత్ కేసరి'.. గత 20ఏళ్ల బాలయ్య కెరీర్​లో తొలి సారి అలా!.

Vithika Sheru: మిలియన్​ ఫాలోవర్లకు చేరువలో... భీమవరం పిల్ల..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.