ETV Bharat / entertainment

'ఆ స్కిట్స్​ కోసం చాలా పెద్ద రిస్క్.. వారం రోజులు నరకం.. ఆస్పత్రికెళ్తే..' - రాకెట్ రాఘవ

Rocket Raghava: జబర్దస్త్​ రాఘవ అంటే అమాయకత్వానికి, క్లీన్​ కామెడీకి పెట్టింది పేరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూర్చొని హాయిగా నవ్వుకునేలా హాస్యం పండిస్తారాయన. ఈ క్రమంలోనే ఓ షాకింగ్​ విషయాన్ని వెల్లడించారు రాఘవ.

jabardasth rocket raghava latest news
jabardasth
author img

By

Published : Jun 10, 2022, 7:05 PM IST

తెలిసే అలా చేశా.. వారం రోజులు ఆస్పత్రిలోనే..: రాకెట్ రాఘవ

Rocket Raghava: ఫ్యామిలీ మొత్తం కలిసి హాయిగా నవ్వుకునేలా హాస్యం పండించాలంటే అది రాకెట్​ రాఘవతోనే! క్లీన్​ కామెడీ, అమాయకత్వంతో.. కొన్నిసార్లు అసలు మాట్లాడకుండానే హావభావాలతో నవ్వించేస్తుంటారు. బిగ్​స్క్రీన్​పైనా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఈ క్రమంలోనే ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన రాఘవ.. తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విశేషాలను తెలియజేశారు. జనాలను నవ్వించడం కోసం చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయని, ఆస్పత్రులకూ వెళ్లాల్సి వస్తుందని అన్నారు.

"బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, అల్లు రామలింగయ్య వంటి సీనియర్ల నుంచి కామెడీ నేర్చుకున్నాం. వాళ్లే మాకు స్ఫూర్తి. కామెడీ చేసేటప్పుడు ఒక్కోసారి దెబ్బలు కూడా తగులుతుంటాయి. జనాలు నవ్వడం కోసం ఏదైనా చేస్తాం. నవ్వించడం అంటే డైలాగులు చెప్పడం మాత్రమే కాదు. ఫిజికల్​గా కూడా కొంత యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి చేతులు, కాళ్లకు దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు పెద్ద దెబ్బలు కొద్దిలో మిస్ అయ్యేవి. మళ్లీ ఆ స్కిట్​లు చూసినప్పుడు.. 'బతికిపోయాంరా బాబు అనుకునేవాళ్లం'"

-రాకెట్ రాఘవ, జబర్దస్త్​ కమెడియన్

వారం రోజులు ఇబ్బంది పడుతూ.. "'దశావతారం' బామ్మ క్యారక్టర్​ను చాలా ఇష్టపడి చేశాను. ఆ పాత్ర కోసం గొంతు సవరించుకొని.. ప్రాక్టీస్​లో, స్కిట్​ చేస్తున్నప్పుడు జడ్జిలకు వినపడేలా గట్టిగా మాట్లాడటం వల్ల గొంతు బాగా రాసుకుపోయింది. దాదాపు వారం రోజులు గొంతు బాగుపడేది కాదు. ఆస్పత్రికి వెళ్లి, మాత్రలు, యాంటీబయోటిక్స్​ వాడేవాడిని. కొన్నిసార్లు ఇన్​ఫెక్షన్​ కూడా అయ్యేది. 'దశావతారం' బామ్మ పాత్రను ఓ నాలుగైదు సార్లు చేశాను. గొంతు పాడవుతుంది, నొప్పి పెడుతుందని తెలిసినా.. జనాలను నవ్వించేలానే ఉద్దేశంతోనే అదంతా చేస్తాం. ఆ నొప్పి కన్నా జనాల నవ్వులే మాకు ముఖ్యం అనిపిస్తుంది." అని రాఘన చెప్పారు.

అదే నా కోరిక: "జబర్దస్త్​ లాంటి గొప్ప షోలో మొదటి నుంచి ఇప్పటి వరకు చేసే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎక్కడ ఎన్ని షోలు చేసినా.. దీనితోనే నాకు గుర్తింపు వచ్చింది. ఇతర దేశాల్లో అయినా.. ఇక్కడి దర్శకనిర్మాతలైనా నన్ను అలానే గుర్తిస్తారు. ఇక సినిమాల్లోనూ సక్సెస్​ అవ్వాలనేదే నా కోరిక. దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నా."

ఇదీ చూడండి: 'కనిపించేంత సరదాగా ఉండను ఏడ్చేస్తా'.. బాడీ షేమింగ్​పై రోహిణి ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.