Sridevi drama company: పటాస్‌తో బుల్లితెరకు పరిచయమై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆర్టిస్ట్‌లు ప్రవీణ్, ఫైమా. స్కిట్లలో వీరు తమదైన స్టైల్లో కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. కమెడియన్లగా వీరు ఎంత పాపులరో వీరి జోడీ కూడా అంతే ప్రత్యేకం. సుధీర్-రష్మీలాగే ఫైమా-ప్రవీణ్ కాంబినేషన్‌కూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్లో మరోసారి ఈ జోడి మెరిసింది. ఈ సందర్భంగా ఫైమాకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు ప్రవీణ్. ఈ సందర్భంగా ఫైమా ఎందుకిష్టమో చెప్పుకొచ్చాడు.
"నాకు ఫైమా ఎందుకు నచ్చిందంటే.. ఆమె తను అనుకున్నది సాధించింది. ఫైమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వాళ్ల అమ్మగారు ఓ కోరిక కోరారు. తమ కంటూ ఓ ఇల్లు ఉండాలని, అందుకే ఓ ఇల్లు కట్టు అని అన్నారు. తాను ఒకవేళ చనిపోతే సొంతింట్లోనే చనిపోవాలన్నారు. ఆవిడ కోరినట్టుగానే ఫైమా నిజంగా తన సొంతింటి కలను నెరవేర్చింది. అందుకే తనంటే నాకు ఇష్టం. ఫైమా మీ అమ్మకు చెప్పు అల్లుడు వస్తున్నాడని!"
-ప్రవీణ్
రష్మీ ఎమోషనల్..
ప్రవీణ్-ఫైమా మధ్య జరిగిన సంభాషణలకు రష్మీ భావోద్వేగానికి గురైంది. "నువ్వు ఇక్కడ ఎవరినైనా మిస్ అవుతున్నావా?" అని హైపర్ ఆది అడగగా తన మనసులోని మాట బయటపెట్టింది. 'మనసులకు, దూరానికి ఏం సంబంధం ఉండదు. అవి ఎక్కడున్నా కలిసే ఉంటాయి' అంటూ సుధీర్ లేని లోటుపై సమాధానం ఇచ్చింది.
ఈ ఎపిసోడ్ ఆదివారం(జులై 17) మధ్యాహ్నం ఒంటి గంటకు ఈటీవీలో ప్రసారం కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి :