Bigg Boss 7 Telugu Fifth Week Elimination : తెలుగు బుల్లితెరపై పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్.. ఐదో వారంలోకి ప్రవేశించింది. 14 మంది కంటిస్టెంట్లతో మొదలైన ఈ సీజన్.. ఫస్ట్ వీక్ నుంచే ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అంతా ఉల్టా పల్టా అంటూ ఉత్కంఠగా నడుస్తోంది. ఇక, ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్లో కిరణ్ రాథోడ్, రెండో వారం ఎలిమినేషన్లో షకీలా, మూడో వారం సింగర్ దామిని భట్ల, నాలుగో వారం రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటి బాట పట్టారు. రతికా ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7(Bigg Boss Telugu Season 7) ఐదో వారం మరింత రసవత్తరంగా మారింది.
Bigg Boss Telugu 7 Season Latest Update : ప్రస్తుతం ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ యమా రంజుగా సాగుతోందనే చెప్పుకోవచ్చు. అయితే.. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. శివాజీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్, టేస్టీ తేజా, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు.. ఈ ఏడుగురు ఈవారం ఓటింగ్‌లో పోటీ పడుతున్నారు. ఇందులో టేస్టీ తేజాని హోస్ట్ నాగార్జున.. జైలు శిక్ష విధించడంతో పాటుగా అతన్ని నేరుగా నామినేట్ చేశారు. కాబట్టి.. తేజాని ఈవారం ఎవరూ నామినేట్ చేయకుండా డైరెక్ట్ నామినేట్ అయ్యాడు. ఇక పవర్ అస్త్ర అందుకున్న ముగ్గురు.. సందీప్, శోభా, ప్రశాంత్(Pallavi Prashanth)లకు మాత్రమే నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది.
నామినేషన్ కత్తిపోటుతో : గతంలో చూసిన కాన్సెప్టుతోనే బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించారు. దీని ప్రకారం.. హౌజ్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకుని.. సరైన కారణాలతో వారిని నామినేట్ చేయాలి. అయితే.. ఇందుకోసం నామినేట్ చేయాలనుకున్న వాళ్ల మెడలో ఉన్న షీటుపై కత్తితో పొడవాల్సి ఉంటుందని బిగ్ బాస్ వారికి వివరించాడు.
Bigg Boss Rathika Rose Remuneration : 4 వారాలకు రతిక గట్టిగానే తీసుకుందిగా!.. ఏకంగా ఎన్ని లక్షలంటే?
ప్రస్తుతం ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే : తాజాగా జరుగుతోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదో వారం ఓటింగ్‌లో శివాజి మొదటి స్థానంలో, ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆరంభం నుంచీ వీరిద్దరి స్థానాల్లో అంతగా మార్పులు కనిపించడం లేదు. అయితే.. వీళ్ల తర్వాతి స్థానాలు మాత్రం తారుమారు అవుతూ ఉన్నాయి. మూడో స్థానంలో ప్రస్తుతం అమర్‌దీప్ కొనసాగుతుండగా, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో ఈ ముగ్గురూ : ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ఐదో స్థానంలో టేస్టీ తేజా ఉండగా.. శుభశ్రీ రాయగురు ఆరో స్థానానికి పడిపోయింది. ఇక అందరి కంటే తక్కువ ఓట్లతో జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. దీంతో ఐదో వారంలో ఈ ముగ్గురూ ఎలిమినేషన్ ప్రమాదంలోనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే.. ఆఖరి స్థానంలో ఉన్న ప్రియాంక జైన్ అందరికంటే ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది. ఆమెనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఓటింగ్‌కి కొంత సమయం ఉంది కదా.. మరి ఎవరు ఈవారం ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.
Sakshi Agarwal Latest Photos : అదిరే ఒంపు సొంపులతో బిగ్ బాస్ బ్యూటీ అందాల రచ్చ.. ఒక్కసారి చూస్తే..