ETV Bharat / entertainment

అల్లు అర్జున్​తో ఛాన్స్​ కొట్టేసిన 'పెళ్లి సందD' బ్యూటీ.. షూటింగ్​ కూడా కంప్లీట్​! - శ్రీలీల కొత్త సినిమాలు

ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​తో 'పెళ్లి సందD' హీరోయిన్​ శ్రీలీల జతకట్టారు!. షూటింగ్​ కూడా పూర్తయింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అదేంటి వీరిద్దరి ప్రాజెక్ట్​ ఎప్పుడు ఓకే అయిందని మీకు డౌటా? క్లారిటీ కోసం ఈ వార్త చదివేయండి.

young beauty pairs up with allu arjun
అల్లు అర్జున్​తో శ్రీలీల
author img

By

Published : Nov 27, 2022, 1:50 PM IST

'పుష్ప' సినిమా తర్వాత పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు చాలా తక్కువగా యాడ్స్ చేసిన బన్నీ ఇటీవల వరుస యాడ్స్​కు ఓకే చెప్పేస్తున్నారు. అనుకున్న సమయానికి షూట్​ కూడా కంప్లీట్​ చేస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు ఆయనతో యాడ్ చేయడానికి మొగ్గుచూపుతున్నాయి.

తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్​లో బన్నీ ఓ యాడ్ షూట్​లో నటించారు. ఇందులో 'పెళ్లి సందD'తో ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరోయిన్ శ్రీలీల ఆయనతో జతకట్టారు. త్వరలోనే బుల్లితెరపై వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్​లో కనిపించబోతున్నారు. అయితే ఇది ఏ కంపెనీకు చెందిన యాడ్ అనేది ఇంకా తెలియలేదు. యాడ్ షూట్ స్పాట్​లో శ్రీలీల, అల్లు అర్జున్, త్రివిక్రమ్, కెమెరా మెన్​లు కలిసి దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

young beauty pairs up with allu arjun
అల్లు అర్జున్​తో శ్రీలీల

అల్లు అర్జున్​ ప్రస్తుతం 'పుష్ప2' సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్లు రాలేదు. మరోవైపు, శ్రీలీల కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆమె మహేశ్​ బాబు, త్రివిక్రమ్​ చిత్రంలో ఛాన్స్​ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు' కోసం పవన్​ ఫుల్​ హార్డ్​ వర్క్.. మాస్టర్​ దగ్గర కరాటే నేర్చుకుంటూ!

'హైదరాబాద్​ అంటే చాలా ఇష్టం.. తెలుగు సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.