Yash 19 Movie Update : 'కేజీయఫ్' సిరీస్ విడుదలై చాలా కాలమైన ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు రాకింగ్ స్టార్ యశ్. ఆయన కొత్త చిత్రం కోసం పాన్ ఇండియా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. పలు ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైనా.. యశ్ సమాధానాన్ని దాటవేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు జాతీయ అవార్డులు అందుకున్న 'లయర్స్ డైస్' (హిందీ) ఫేమ్ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ కాంబో దాదాపు ఖరారైనట్లేనని సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ట్విట్టర్లో #yash 19 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
"ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలు కానుంది. యశ్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు" అని ఓ టీమ్ మెంబర్ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సంయుక్త మేనన్, ఓ కీలక పాత్రలో మలయాళ హీరో టొవినో థామస్ నటించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
Yash 19 Movie Director : గీతూ మోహన్‌దాస్ ఎవరంటే? గీతూ మోహన్‌దాస్ అసలు పేరు గాయత్రీ దాస్. ఈమెది కొచ్చి. బాల నటిగా 'ఒన్ను ముత్తై పూజాయిమ్ వరే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత, మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. 'అకలే' సినిమాలో నటనకుగాను ఉత్తమ నటి విభాగంలో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
2009లో కెల్కున్నుందో అనే షార్ట్‌ఫిల్మ్‌తో దర్శకురాలిగా మారింది. 2014లో ఆమె డైరెక్ట్ చేసిన లయర్స్ డైస్‌కు రెండు జాతీయ అవార్డుల తోపాటు స్పెషల్ జ్యూరీ విభాగంలో సోఫీయా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చింది. 2019లో మూథన్ అనే చిత్రం తెరకెక్కించింది. ఈ చిత్రం సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016 లో గ్లోబల్ ఫిల్మ్‌మేకింగ్ అవార్డును ముద్దాడింది. అలా గీతూ డైరెక్ట్ చేసింది రెండు చిత్రాలే అయినా అవి అంతర్జాతీయ అవార్డులును అందుకున్నాయి. ఇప్పుడామెతో యశ్ సినిమా చేస్తున్నారని తెలియగానే అభిమానుల్లో అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.
యశ్ యూ టర్న్.. రూ.1500కోట్ల ప్రాజెక్ట్ లుక్ టెస్ట్‌కు రెడీ!