ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తాను.. ఇలాగే కష్టపడుతూ ఒలింపిక్స్‌లోనూ ఛాంపియన్ అవుతానని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్.. సహచర బాక్సర్లతో కలిసి మంగళవారం దిల్లీకి చేరుకుంది. ఆమెతో పాటు టోర్నీలో కాంస్యాలు గెలిచిన మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)లను ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ), కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సన్మానించాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నేనిలా కష్టపడతానని, భవిష్యత్తులోనూ దేశం గర్వించేలా చేస్తానని హామీ ఇస్తున్నా. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అయ్యా. దేవుడు కరుణిస్తే ఒలింపిక్ ఛాంపియన్‌గా అందరి ముందూ నిలుస్తా’’ అని నిఖత్ పేర్కొంది.
ఇదీ చదవండి:IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్‌కు గుజరాత్.. రాజస్థాన్‌పై గెలుపు