అసలైన హీరోయిజానికి నెలవు పోలీస్ కథలు. అందుకే తమ అభిమాన హీరోలు యూనిఫామ్ వేసుకుని లాఠీతో స్టైల్‌గా నడిచొస్తే.. స్క్రీన్‌పై చూసి తెగ మురిసిపోతుంటారు సినీప్రియులు. ఇక రివాల్వర్ పట్టుకుని.. శత్రువులపై విరుచుకుపడితే థియేటర్ మొత్తం విజిల్స్‌తో మోతెక్కిపోవాల్సిందే. అలాగే హీరోలకు తమ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చూపించడానికి అవకాశం దక్కడంతో పాటు సోషల్ మెసేజ్‌ను ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే మంచి కథలు దొరికినప్పుడల్లా పోలీస్ రోల్స్‌తో అలరించే ప్రయత్నం చేస్తుంటారు మన హీరోలు.
ముఖ్యంగా ఈ పోలీస్ కథలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటారు మాస్ మహారాజా రవితేజ. ఈ తరం తెలుగు హీరోల్లో ఎక్కువసార్లు పోలీస్ ఆఫీసర్‌గా నటించింది ఆయనే. అయితే ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఓసారి ట్రై చేస్తే పోలా అంటూ ఖాకీ చొక్కా ధరించేస్తున్నారు. రవితేజ 'క్రాక్' బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ ట్రెండ్ ఇంకాస్త ఊపందుకుందనే చెప్పాలి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ మధ్య లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్'గా వచ్చారు. కానీ అది ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయితే ఇప్పుడు త్వరలోనే వారం గ్యాప్‌లో హీరోలు అల్లరి నరేశ్, నాగ చైతన్యలు పోలీస్ యునిఫార్మ్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రాబోతున్నారు.
దర్శకుడు విజయ్ కనకమేడల-అల్లరినరేశ్ సూపర్ హిట్ 'నాంది' కాంబినేషన్లో మే 5న 'ఉగ్రం' రాబోతుంది. ఇది స్లీపర్ హిట్ అవుతుందనే నమ్మకం కనిపిస్తోంది. తొలిసారి నరేశ్.. జుత్తు కత్తిరించుకుని రిస్క్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే నరేశ్ తన ఇంటెన్స్ యాక్టింగ్‌ను చూపించారు. కిడ్నాప్ మాఫియా బ్యాక్ డ్రాప్లో రూపొందిన రివెంజ్ డ్రామాగా కనిపించింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
ఇకపోతే నాగచైతన్య నటించిన 'కస్టడీ' మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. న్యాయం కోసం ఎంత వరకు వెళ్లైనా పోరాడే సిన్సియర్ పోలీసు క్యారెక్టర్ చేశారు. టిపికల్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందించడంతో మూవీపై ఆడియెన్స్‌లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 'మానాడు' లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. మరోవైపు చైతూకు కూడా ఇది కెరీర్లో హై బడ్జెట్ సినిమా ఇది. అలా అల్లరి నరేశ్ 'ఉగ్రం', చైతూ 'కస్టడీ' రెండూ సీరియస్ బ్యాక్ డ్రాప్లో పోలీస్ కథతో సాగుతాయి. మరి ఈ ఇద్దరు హీరోలు సినీ లవర్స్‌ను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ప్రభాస్ కొత్త సినిమా కోసం క్రిష్?