2022.. తన జీవితంలో మరచిపోలేని ఏడాదిగా మిగులుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్. ఆలియా భట్‌తో వివాహం సహా ఇదే సంవత్సరం ఆయన నటించిన రెండు సినిమాలు వెనువెంటనే విడుదలకు సిద్ధంగా ఉండటం విశేషం. అందులో ఒకటి 'షంషేరా' కాగా, మరొకటి 'బ్రహ్మాస్త్రం'. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు అభిమానులకు తన వివాహ కానుకా? అని ముంబయిలో జరిగిన 'షంషేరా' ట్రైలర్ విడుదల వేడుకలో ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు రణ్‌బీర్.
"అలియాతో జీవితం చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా గొప్పది. ఎందుకంటే నాకు అలియాతో పెళ్లయింది. నా జీవితంలో జరిగిన అత్యంత సంతోషకర పరిణామం ఇది. 'పెళ్లంటే పప్పన్నం లాంటిది. జీవితానికి అది సరిపోదు. కీమా పావ్, తంగ్డీ కబాబ్, లాంటివి ఎన్నో ఉండాలి' అని నా సినిమాల్లో చెప్పాను. కానీ వ్యక్తిగత అనుభవాల ప్రకారం నాకు పప్పన్నమే చాలు. అలాంటి జీవితమే ఇష్టం. అలియాతో నా లైఫ్ బాగుంది. అంతకంటే ఇంకేమీ వద్దు"
- రణ్‌బీర్ కపూర్, నటుడు
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆలియా భట్‌ను సమీప బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు రణ్‌బీర్. ఆలియాతో నటించిన బ్రహ్మస్త్రం.. సెప్టెంబర్ 9న విడుదలకానుంది. వాణీకపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో మెరిసిన షంషేరా జులై 22న ప్రేక్షకులముందుకు రానుంది. చివరగా 2018లో వచ్చిన సంజు చిత్రంలో అలరించిన రణ్‌బీర్.. ఇకపై వరస సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు. ఆలియా ప్రస్తుతం హాలీవుడ్లో తన అరంగేట్ర చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రీకరణ కోసం లండన్‌లో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో హాట్‌గా జాన్వీ.. మతిపోగొట్టేస్తున్న కియారా