ETV Bharat / entertainment

Pushpa 2 The Rule : 'పుష్ప టీమ్​ మేలుకో'.. బన్నీ అభిమానుల ట్వీట్ల మోత - పుష్ప 2 ది రైజ్ బడ్జెట్

Wake Up Team Pushpa Trending In Twitter : ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ అభిమానులు.. ట్విట్టర్​లో మోత మోగిస్తున్నారు. పుష్ప-2కు సంబంధించి అప్డేట్స్​ కావాలంటూ వరుస ట్వీట్లు చేస్తూ డిమాండ్​ చేస్తున్నారు.

Wake Up Team Pushpa Trending In Twitter
Wake Up Team Pushpa Trending In Twitter
author img

By

Published : Aug 5, 2023, 10:22 PM IST

Updated : Aug 5, 2023, 10:33 PM IST

Pushpa 2 The Rule Update : పుష్ప 1 ది రైజ్.. 2021లో విడుదలైన సినిమా బంపర్ హిట్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తెలుగుతో పాటు హిందీలోను కూడా బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇతర భాషల్లోనూ అదరగొట్టింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. దర్శకుడు సుకుమార్ టేకింగ్, సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ తెగ మెప్పించేసింది. దీంతో పుష్ప 1కు సీక్వెల్‍గా రూపొందుతోన్న పుష్ప 2: ది రూల్ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 1 సూపర్ హిట్ అవడం వల్ల పుష్ప 2 : ది రైజ్ చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. మొదటి భాగం కంటే రెండో పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్లకు కొన్ని మార్పులు చేస్తున్నారు. అయితే, పుష్ప టీమ్ నుంచి అప్డేట్లు రాకపోవడం వల్ల బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హీరో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, వేర్ ఈజ్ పుష్ప వీడియో గ్లింప్స్ మినహా మరే అప్‍డేట్స్ రాలేదు. గ్లింప్స్ వచ్చి సుమారు మూడు నెలలు అవుతోంది. దీంతో అభిమానులు మరోసారి ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నారు.

Wake Up Team Pushpa Trending In Twitter : "పుష్ప టీమ్ మేలుకోవాలి" అంటూ "#WakeUpTeamPushpa" హ్యాష్ ట్యాగ్‍తో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ మళ్లీ ట్రెండింగ్‍లోకి వచ్చింది. పుష్ప 2: ది రూల్ అప్డేట్లు కావాల్సిందేనని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇతర చాలా సినిమాల అప్డేట్లు వస్తూనే ఉన్నాయని, కానీ పుష్ప టీమ్ నుంచి ఏం రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను హ్యాష్‍ట్యాగ్‍లను కూడా జోడించి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

పుష్ప మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను వైవిధ్య నటుడు ఫహాద్ ఫాజిల్ పోషిస్తున్నారు. జగదీశ్ ప్రతాప్ బండారీ, రావు రమేశ్, జగపతిబాబు, అనసూయ, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్.. నిర్మిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాలో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయబోతుందని సమాచారం.

Pushpa 2 Update : 'పుష్ప-2' రిలీజ్​ మరింత ఆలస్యం​!.. కారణం అదేనా?

Pushpa 2: 'పుష్ప ఎక్కడ?'.. ఇదిగో సమాధానం వచ్చేసింది!

Last Updated : Aug 5, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.